పిల్లలు ఇష్టపడే పదార్థాలు అన్నింటిలోనూ కెఫిన్ ఉంటుంది.కాఫీ,టీలు ఇవ్వరుగానీ కోలాలు, సోడాలు ,చాక్లెట్లు హాట్ చాక్లెట్స్ చివరకు దగ్గు సిరప్ లోనూ కెఫిన్ ఉంటుంది. కోల్ట్ కాఫీ,ఐస్ టీ ,సోడాలో కెఫిన్ మోతాదు ఎక్కువే .తలనొప్పి ,నిద్రలో ఏకాగ్రాతలో లోపాలు హార్ట్ రేట్ ,రక్తపోటు పెరగటానికి కారణం కెఫినే. పిల్లల్లో ఈ లక్షణాలు మరింతగా పెంచుతోందీ కెఫీన్. ఈ విషయం పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ ఈ పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలి. పిల్లలకు ఐదారేళ్ళ వయసు వచ్చినా వాళ్ళకు నెమ్మదిగా అరచి కోప్పడి బెదిరించకుండా అర్థం అయ్యేలా వాళ్ళకు నెమ్మదిగా చెపితే వాళ్ళు ఆ పదార్థాలకు దూరంగానే ఉంటారు. వాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పే ఓర్పు మనకే ఉండాలి.

Leave a comment