ఎముకల పటుత్వానికి కాల్షియమ్ వడమంటారు కానీ దీని వల్ల ఎముకల పటుత్వం పెరిగినా దీర్ఘకాలం లో గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెప్పుతున్నారు. నార్వే యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న లక్ష మంది మహిళల పైన పరిశోధనలు చేస్తున్నారు. వీళ్ళందరూ డాక్టర్ సలహా పైన వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియమ్ తీసుకున్న వారే. పరిశోధన కోసం కాల్షియమ్ సప్లిమెంట్స్ వాడే వారినే ఎంచుకున్నారు. వీరిలో పదివేల మంది ఎముకలు విరగడం నుంచి తప్పించుకున్న పది వేల మంది గుండెకు సంబందించిన జబ్బుతో మరణించడం వీరు గమనించారు. కాల్షియమ్ సప్లిమెంట్స్ దీర్ఘకాలం తీసుకోవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయని వారు నిర్ధారించారు.

Leave a comment