రాత్రివేళ సరిగ్గా నిద్ర పోలేక పోతే పగలు ఎన్నో క్యాలరీస్ శరీరంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విస్తృతమైన అధ్యయనాలు చేశారు. మామూలుగా ప్రశాంతంగా 6,7 గంటలు నిద్రపోయే వారికంటే ఒకటి రెండు గంటలు తక్కువ నిద్రపోతే మరుసటి రోజు పగలు సగటున 549 కాలరీలు ఎక్కువగా తీసుకొంటున్నట్లు గుర్తించారు.నిద్ర సరిగా పోకపోతే లెప్టిన్, ఘెరెలిన్ హార్మోన్ లలో మార్పులు వస్తాయి. ఇది మెటాబాలిజాన్ని ప్రభావితం చేస్తాయి. తక్కువ నిద్ర పోవటం వల్ల శరీరంలోకి చేరినా క్యాలరీలు ఖర్చు అవ్వవు.మరుసటి రోజు ఎప్పటిలా భోజనం చేయటం వల్ల అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. అలా తెలియకుండానే బరువు పెరిగిపోతున్నారని ,ఇది నిద్రలేమి కారణం వల్లనే అని గ్రహించమంటున్నారు పరిశోధకులు.
Categories