సైనిక రంగంలో కమాండో లకు శిక్షణ ఇచ్చే ఏకైక మహిళా సీమా రావు. కమాండోల శిక్షణకు ఈమె తయారు చేసిన విధానాలను అమెరికా వారి ఎఫ్.బి.ఐ బ్రిటిష్ రాణి సిబ్బంది ఇంటర్పోల్ వంటి వారు పాఠాలుగా తీసుకున్నారు. ముందుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఆపైన సైనిక శిక్షణ తీసుకొని ఇజ్రాయిల్ లో, వారి కమాండో శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షకుడి అర్హత సాధించారు సీమా రావు. ఇప్పుడు వి ఐ పి ల వెంట కనిపించే ఎన్.ఎస్.జి బ్లాక్ క్యాట్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గరుడ కమాండో పోల్స్ నెవీ వారి మెరైన్ కమాండో లందరూ సీమా దగ్గర శిక్షణ తీసుకున్నవారే. పాతికేళ్ల తన కెరీర్ లో 20 వేల మంది సైనికులకు కమాండో లుగా తీర్చిదిద్దారు సినిమా రావు.

Leave a comment