కరోనా కు బయపడకండి. అవగాహనతో ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా కు గొంతు గరగరకు సంబంధం లేదు. జ్వరం దగ్గు ఆయాసం రెండు రోజుల పాటు తగ్గుతూ పెరుగుతూ ఉంటేనే డాక్టర్ ను సంప్రదించాలి. జ్వరం వంద డిగ్రీల సెల్సియస్ ఉంటే వైద్యం చేయించుకోవాలి మధుమేహం ఉన్నా వాళ్ళు గర్భిణులు,గుండె,మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష అవసరం లేదు విదేశీ ప్రయాణం చేసిన దగ్గు,ఆయాసం,జ్వరం ఉన్నవాళ్ళు ,ఆలా ఉన్నవాళ్ళతో సన్నిహితంగా మెలగినవాళ్ళు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. గర్భిణిలు బాలింతలు ఈ సమయంలో ఐసోలేషన్ క్వారంటైన్’లో ఉండటం మంచిది అంటున్నారు డాక్టర్లు.

Leave a comment