కేన్సర్  వస్తే సిగ్గు పడద్దనీ వ్యాధిపై సైనికుల్లా పోరాడాలనీ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రముఖ  నటి గౌతమి పిలుపు నిచ్చారు. ఈ మహమ్మారిని జయించటం గొప్ప కష్టం ఏమీ కాదనీ దానికి తనే ఉదాహరణ అని ఆమె అన్నారు. కేన్సర్ పై శ్రీ రక్ష చారిటబుల్ ట్రస్ట్ అడపాలు  ఫౌండేషన్ బహ్రెయిన్  కువైట్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఒక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడేరు. కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తనకు బ్రెస్ట్ కేన్సర్  సోకిందనీ  ఈ వ్యాధి సోకిన విషయాన్నీ లక్షణాల ద్వారా తానే గుర్తించాలనీ కుంగిపోకుండా ఎంతో నిబ్బరంగా ఈ వ్యాధి నుంచి తనను తాను కాపాడుకోగలననీ ఆమె చెప్పారు. తనకు అండగా నిలబడిన తన స్నేహితులు తనకెంతో ధైర్యం చెప్పారనీ తనకు వ్యాధి సోకిన విషయాన్నీ మరచిపోయేంత ధైర్యంగా ఉన్నందువల్లే ఇవ్వాళ్ళ  ఇలా ఆరోగ్యాంగా ఉన్నానన్నారామె. ఆడవాళ్ళూ సిగ్గుపడి భయపడి ఇలాంటి అనారోగ్యాలు దాచుకోవద్దనీ ఆమె హితవు చెప్పారు.

Leave a comment