ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల పేగు క్యాన్సర్ వస్తోందని పరిశోధనలు చెపుతున్నాయి . అయితే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఎర్ర ఉల్లి ,బ్రకోలి,దానిమ్మ స్ట్రాబెరీలు ,ఆప్రకాట్లు ,ఎర్ర క్యాబేజ్ వంకాయలు వంటివి ఎక్కువగా తినే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉందంటున్నారు . గతంలో ఆస్ట్రిన్ లో శాలిసిలిన్ ఆమ్లం ,పొట్టలోని బాక్టీరియా తో కలిసినపుడు 2,4,6,ట్రై హైడ్రేడ్స్ బెంజాయిక్ ఆమ్లం విడుదలై క్యాన్సర్ కణవిభజనను అడ్డు కొనేలా చేస్తుందని తెలుసుకొన్నారు . అదే మాదిరిగా  ద్రాక్ష బ్లూ బెర్రీస్ వంటివి తిన్నప్పుడు కూడా ఆ పదార్ధం విడుదల అవుతోందని కనుగొన్నారు . కనుక ఊదా ,ఎరుపు రంగు పండ్లు కూరగాయలతో పేగు  కాన్సర్ ను నియంత్రించ వచ్చని నిపుణులు కనుగొన్నారు .

Leave a comment