మహిళల్లో రుతుస్రావం నిలిచిపోయాక వచ్చే క్యాన్సర్లను అడ్డుకునేందుకు సేంద్రియ ఆహారాన్ని తీసుకోమంటున్నారు అధ్యాయనకారులు. రసాయన,పురుగు మందుల అవశేషాలు శరీరంలో చేరి అనారోగ్య హేతువులు అవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఆహారంతో పాటు సాధారణ కూరలు,పండ్లు తినడం మంచిది అంటున్నారు. ఆరోగ్యభరితమైన ఆహారపదార్దాలు అనుసరించాలి. సేంద్రియ ఆహారంలో ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రావు.రపాయనాలు వేయని ఆకుకూరలు పండ్లు ధాన్యాలతో తప్పని సరి ఎక్సర్ సైజ్ రోటీన్లతో కొన్ని అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చునని అధ్యయనకారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము కాన్సర్ ముప్పుని సేంద్రీయ ఆహారం ద్వారా దూరంపెట్టవచ్చుంటున్నారు.

Leave a comment