ఎంత వయసు వస్తున్నా ఫిట్ నెస్ తో ఉండాలి అనుకుంటే కార్డియో వ్యాయామాలు బెస్ట్ అంటారు ట్రైనర్స్. ఇవి స్టామినా పెంచే వ్యయామాలు. చాలా సేపు చేసిన అలసట రాకుండ ఉంటుంది.సాధరణంగా వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటే 50కిలోల బరువును అవలీలగా ఎత్తవచ్చు. కానీ ఆ బరువు ఒక అరగంట పాటు అయినా మోసే సామర్ధ్యం కావాలి అనుకుంటే ఎరోబిక్స్ తోనే సాధ్యం. కాళ్ళు ,చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్ లాగా చేసే వ్యాయామాలు నడక,జాగింగ్ ,సైక్లింగ్ ,స్విమ్మింగ్ ఇవన్ని ఆ వ్యాయామంలోకే వస్తాయి. ఈ ఎండ్యూరెన్స్ వ్యయామాలతో శ్వాస తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నిండే గాలి పెరుగుతుంది. గుండె వేగం పెరిగి కణం,కణం ఆక్సిజన్ పెరిగి స్టామినా పెరుగుతుంది.

Leave a comment