తెలుగు సినిమా పరిశ్రమలో రాణించిన కథానాయకల్లో ముందు వరుసలో ఉంటుంది సమంత. సంవత్సరానికి నాలుగు సినిమాలు తక్కువ కాకుండా కేరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుటివరకు చేస్తూనే ఉంది సమంత. నిశ్చితార్థం పెళ్ళి జరిగిన సంవత్సరంలో కూడా రాజుగారి గది2 విడుదల అయింది. ఇక ఈ సంవత్సరం రంగస్థలం,మహానటి భారీ విజయంతో పాటు ప్రస్తుతం యూటర్న్ రీమేక్ నాగచైతన్యతో కలిసి ఇంకో చిత్రంలో ఆమె బిజీగా ఉంది. ఏడాదికి ఇన్ని సినిమాలు చేయలని ఇంకా ఎక్కువ పరుగు పెట్టాలని నేనెం అనుకోవటం లేదు. నేను సక్సెస్ ఫుల్ గా చేయగలిగిన పాత్ర వస్తే మాత్రం వదిలిపెట్టను అంటోంది సమంత.

Leave a comment