వేధింపుల గురించి నోరెత్తితే  ఇక వాళ్ళ కెరీర్ క్లోజ్ అంటోంది ఇలియానా.  అవకాశాల కోసం మహిళలు కొంత అవమానం సహించే ఉంటున్నారు.  అంచేత ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం . ముందు కెళ్ళాలో ఆగిపోవాలో వాళ్ళు తేల్చుకోవాలి.  ఒక వేళ పెద్డ స్టార్లపై  లైంగిక వేధింపులకు  సంబంధించిన ఆరోపణలు బయటికి వస్తే వాళ్ళకు సపోర్టుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ప్రజల ముందకు వస్తేనే మార్పు వస్తుంది.  మన దేశంలో నటుల పట్ల ప్రేక్షకులకు ఎంతో గౌరవం. వాళ్ళు నీచంగా ప్రవర్తిస్తారని చెప్పిన నమ్మరు. నటుల్లో చవకబారు తనం ఉంటుందని ఎంతో మంది గొంతులు విప్పితే తప్ప ఆరోపణలు నిజంగా నిరూపించలేరు. నేను పిరికి తనంతో మాట్లాడటం లేదు . హీరోయిన్ లు మాట్లాడితే కెరీర్ వదులు కోవలసిందే అంటోంది ఇలియానా.

Leave a comment