వారానికి ఒక్క సారి క్యారెట్ మాస్క్ వేసుకుంటే మంచి మెరుపు, నిగారింపు వస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్యారెట్ మెత్తగా ఉడికించి గుజ్జుగా చేసి తేన, ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొహం, మెడ వరకు పట్టించి, ఓ అరగంట తర్వాత వెచ్చని నీటి తో మొహం శుబ్రం చేసుకుంటే ముఖ సౌందర్యం మెరుగు పడ్డట్టు స్పష్టంగా తేలుస్తుందంటున్నారు. పచ్చి క్యారెట్ తినడం వల్ల రోజంతా శరీరానికి కావలిసిన విటమిన్లు పుష్కలంగా దోరుకుతాయి. కళ్ళు శరీర బాహ్య కనజాలన్నీ ఆరోగ్య వంతంగా ఉంచ గల శక్తి క్యారెట్ కు వుంది. ఇది మంచి ఆహారం గానూ, సౌందర్య పరదాయిని గానూ ఉపయోగ పడుతుందని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment