Categories

సింగపూర్ లో ప్రీ స్కూల్ నడిపే ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా గేమింగ్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి క్రియేటివ్ గెలీలియో పేరుతో ఒక స్టార్టప్ ను ప్రారంభించారు మూడు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకు విద్యను అందించేందుకు ఉపయోగపడే ఈ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తులతో, ఎడ్యుకేషన్ వీడియోలు, ఆడియో లుక్ లో ఇంటరాక్టివ్ గేమ్ లు వంటివి ఎన్నో ఉన్నాయి. లిటి సింగమ్ యాప్ కూడా ఈ స్టార్టప్ తో పాటు తీసుకువచ్చింది ప్రేరణ. దీన్ని కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ఇష్టపడే,బాహుబలి, శక్తిమాన్, బాల్ గణేష్, ఘటోత్కచ్ పాత్రలతో పాఠాలు చెబుతారు. గత సంవత్సరం ఈ స్టార్టప్ విలువ 40 మిలియన్ డాలర్లకు చేరింది.