Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

4239 Articles
తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో చెట్లు కులుస్తున్న ఈ రోజుల్లో మొక్కలే ప్రాణం అనుకుని 60 సంవత్సరాలుగా తన స్వగ్రామం హలికల్ కు వచ్చే దారిలో వరుస్సగా చెట్లు నాటి, వాటి సంరక్షణ చేసింది. ఇప్పుడవి పెద్ద వృక్షాలు. ఈమెది ఈ చెట్ల పరిరక్షణ చేసిననదుకు నేషనల్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం మొక్కలు నటించే కార్యక్రమానికి తిమక్క అని పేరు పెట్టారు. రహదారుల వెంట నీడ నిచ్చే చెట్లను పెంచడమే తిమక్క లక్ష్యం 20 వ ఏట పెళ్ళైన ఆమెకు 40 ఏళ్ళు వచ్చినా సంతానం లేరు. చుట్టూ పక్కల వాళ్ళు ఆమెను గొడ్రాలు అంటే చెరువులో దుకిందట తిమ్మక్క. ఒక్క చెట్టు ఆమె చేతికి దొరికి ఆమెను చవనివ్వలేదట. ఆ నాడు తనకు ప్రాణాలు కాపాడి సందేశం ఇచ్చిందని భావించి, మొక్కలు పెంచడం మొదలు పెట్టింది తిమక్క ఎంతో మంది తిమక్కలు పుట్టి ఈ భూగోలాన్ని పచ్చగా చేస్తే బాగుంటుంది.
Categories
Gagana

చెట్ల పరిరక్షణ చేసిన తిమక్క

March 8, 2017
0 mins read
తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల…
Read more
ఇరవై ఏళ్ల గౌరీ చిందార్కర్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రతిభాశాలిగా బిబిసి గుర్తించింది. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ లో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని తీసుకొచ్చిందీ అమ్మాయి. మరాఠీ తప్ప ఇంకో భాష రాని గౌరీ ఇంగ్లీష్ నేర్చుకొని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఉన్న టీచర్స్ తో పాఠాలు చెప్పించే స్థాయికి ఎదిగి స్కూల్ స్థాయిని కూడా పెంచింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ని ఉపయోగించుకొని స్కూల్ పిల్లలు ఎలా బాగుపడోచ్చో నిరూపించింది. ఇటువంటి పద్ధతిని ఇప్పుడు స్కూల్ ఆఫ్ క్లౌడ్ అని పిలుస్తున్నారు. ఈ క్లౌడ్ ని ఉపయోగించుకొన్న మొదటి భారతీయ అమ్మాయి గౌరీ. మరెంత మందో స్కూల్ పిల్లలకి ఈ మార్గం చూపించి, విదేశాల్లో ఉన్న స్వచ్చంద టీచర్స్ చేత పాఠాలు చెప్పించింది.చదువంటే ర్యాంకులు కాదు భిన్నమైన కొత్త జీవితం అని నిరూపించింది గౌరీ. 2016 బిబిసి జాబితాలో ఈ అమ్మాయి పేరు చూసి గౌరీ ఎంత ఆశ్చర్య పడిందో, ఆమె ఇంజనీరింగ్ చదువుతున్న పూనా కాలేజీ వాళ్ళు కూడా అంతే ఆశ్చర్యపోయారట.
Categories
Gagana

బిబిసి జాబితాలో ఇంజనీరింగ్ స్టూడెంట్

March 8, 2017
0 mins read
ఇరవై ఏళ్ల గౌరీ చిందార్కర్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రతిభాశాలిగా బిబిసి గుర్తించింది.…
Read more
బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఆమె చైర్ పర్సన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వంటి ఇతర బ్యాంకులను వకీకృతం చేసే ప్రక్రియను చేపట్టి సమర్ధవంతంగా ప్రారంభించాలి. ఈమె ఆధ్వర్యం లోనే SBI లైఫ్ ఇన్సూరెన్స్, SBI కష్టోడియల్ సర్వీస్ వంటివి ఆరంభమయ్యాయి. చైర్మన్ గా 2014 లో నియామకం అయిప్పుడు ఒక మహిళ అంత బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహించ గలరు అని సందేహం వ్యక్తం చేసారు ఎందుకో కానీ ఆమె ఒక్క సంవత్సరం లోనే తనదైన ప్రత్యేక ముద్ర వేసారు. 2016 లో ఫోర్బ్స్ లో ఆమె సక్తో వంతమైన మహిళల్లో 25వస్థానం లో ఉన్నారు. ఫారిన్ పాలసీ పత్రిక ప్రపంచ మేధావుల లిస్ట్ లో వంద మంది లో అరుందతి పేరు చేర్చారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో శక్తి వంతమైన మహిళల్లో అమెది నల్గోవ స్థానం.
Categories
Gagana

బ్యాంకింగ్ లో తిరుగు లేని నేత

March 8, 2017
1 min read
బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి…
Read more
ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి అనిపించుకుంటోంది శృతి. అయితే కమల్ హాసన్ కూతురిగా ఈ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ నన్ను పలకరించటానికి ఐదేళ్లు పట్టిందంటోంది శృతి. ఇప్పటి స్టార్ హోదా తాను కోరుకోలేదన్నది. ప్రారంభంలో ఐరెన్ లెగ్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇంకో నాలుగైదు ఏళ్ల తర్వాత ఈ పేరు హోదా రెండు ఉండకపోవచ్చు.కానీ నేను ఎప్పటి శృతి గానే ఉంటాను. బేసిక్ గా నేను చాలా స్ట్రాంగ్ . ఈ విషయం నాబాడీ లాంగ్వేజ్ నా మాట తీరు చెప్పేస్తాయి. అలాగే మా తల్లి తండ్రుల ప్రభావం నా పైన ఎక్కువ గానే వుంది. మా ఫాథర్ లాగే ప్రయోగాలు చేయటం నాకెంతో ఇష్టం. బాలీవుడ్ లో డిడే అలంటి సినిమానే. అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు . అదే సినిమా నా కెరీర్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందీ లేదు కాకపోతే ఇక ప్రయోగాలు చేసే ముందర ప్రేక్షకులను దృష్టి లో పెట్టుకుంటాను అంటోంది శృతి. ఈ సంవత్సరం నాన్న తో నటించిన శభాష్ నాయుడు రాబోతోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా వస్తోంది. ఇప్పుడు తెలుగు తమిళంలో సుందర్. సి తీస్తున్న సంఘ మిత్ర ఒప్పుకోను. ఈ సంవత్సరం బాగానే నడుస్తోంది అంది శృతి హాసన్.
Categories
Gagana

పేరు హోదా నన్ను మార్చలేవు

March 7, 2017
1 min read
ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి…
Read more
క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ నాన్న నేను అందరం ఆమె వీరాభిమానులం. అంటోంది అమలా పాల్. ఈ సబ్జెక్టు ను ప్రతి చోటా చెప్పాలి. దీని ప్రభావం విడుదలైన ప్రతి చోటా ఉంటుంది. ఎందరో మహిళలు రిలేట్ అవుతారు. మహిళల వికాసం తమని తాము అందంగా మలుచుకోవడం తెలుసుకుంటారు. క్వీన్ కథను కేరళ పద్దతి లో చెపితే బావుంటుందనుకుంటున్నాను అన్నారామె. సూసీ గణేష్ ' తురుట్టు పాయిలె ' ధనుష్ వి ఐ పి -2 ,వడచెన్నయ్ , సిన్ద్రిల్లా క్వీన్ చిత్రాల్లో చాలా బిజీగా వుంది అమలా పాల్. వడ చెన్నయ్ లో నార్త్ చెన్నయ్ అమ్మయిగా నటిస్తోంది అమలా పాల్. శారీరికంగా చాలా మారాలి. ఇది పీరియడ్ ఫిల్మ్. అంతా సహజంగా ఉంటుంది. ఇదో మంచి సబ్జెక్టు. అలాగే చెన్నయ్ లో వేగన్ రెస్టారెంట్ ప్రారంభిస్తాను . రెస్టారెంట్ తో పాటు యోగా మెడిటేషన్ కూడా నేర్పిస్తాను. మరింత క్రమశిక్షణ గా ఆరోగ్యంగా నా జీవన శైలి మార్చుకుంటున్నాను అంటోంది అమలా పాల్ .
Categories
Gagana

రెస్టారెంట్ బిజినెస్ లోకి అమలా పాల్

March 7, 2017March 7, 2017
1 min read
క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి…
Read more
దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC లో ఆమె శుక్రవారం విధుల్లో చేరాక ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ పి . మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే షి క్యాబ్స్ 40 వరకు మంజూరు చేశామని సరితా ఒకవేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలనుకుంటే ఆమెకో కారు ఇస్తామని చెప్పారు. స్త్రీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
Categories
Gagana

టీఎస్ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా

March 6, 2017
1 min read
దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా…
Read more
విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య ఉత్తర అమెరికా ఖండం నుండి ఎంపికైంది. విజయవాడ కు చెందిన సురేష్ కొగొలను శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కే .ఎల్ . యూ లో 2012 లో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల క్రిందట గిజిటల్ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్ వెళ్ళింది .
Categories
Gagana

విజయవాడ యువతికి ప్రపంచ ఫోటోగ్రఫి అవార్డు

March 6, 2017
0 mins read
విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక…
Read more
2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు లో నటించిన సమంతకు బంగారు తల్లి లో నటించిన అంజలీ పాటిల్ కి ఉత్తమ నటి గా అవార్డులు గెలుచుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభత్వం ప్రకటించిన నంది అవార్డుల పట్ల విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
Categories
Gagana

సమంత కు అంజలీ పాటిల్ కు ఉత్తమ నటి అవార్డు

March 3, 2017
0 mins read
ఉత్తమనటి అవార్డులు 2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు…
Read more
14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కనిపించిన కొద్దిసేపే నూరు మార్కులు తెచ్చేసుకుంది. ఆమె ఆ లెహెంగా తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే నాగార్జున ఇది పూర్తి బంగారు లెహెంగా కాకపోయినా ప్రగ్యా చక్కగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అప్పటికే ప్రగ్యా రెండో సినిమా కంచె కు నేషనల్ అవార్డు వచ్చింది. తన సినీ రంగ ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రగ్యా జైస్వాల్ అందరు బెస్ట్ డైరెక్టర్స్ వల్లనే తనకు పేరు వచ్చిందన్నది. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా పాకెట్ మనీ కోసం అందాల పోటీల్లో పాల్గొనన్నాన్నది. అక్కడ నుంచి సినిమాల పైన ఆసక్తి పెరిగి ఇంట్లో వాళ్ళని కష్టం మ్మీద ఒప్పించి ఇక ప్రయత్నాలు ఆరంభించానన్నది.ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.
Categories
Gagana

ఇంట్లో వాళ్ళను ఒప్పించటమే కష్టం అయింది

February 28, 2017
0 mins read
14 కిలోల బరువున్న బంగారు లెహెంగా తో నమో వేంకటేశాయ  లో నటించిన…
Read more
చక్కని తీరైన కనుముక్కు తీరు ఒక ఒద్దికైనా రూపం హుందాగా ఉండే వస్త్ర ధారణతో చందమామ వంటి కాజల్ కెరీర్ బాట లో దూసుకుపోతూనే వుంది. ఇటు ఉత్తరాదినే కాదు. బాలీవుడ్ లోను బిజీ. చిరంజీవి 150 వ చిత్రంలో నటించేసి తండ్రీ కొడుకులతో నటించిన ఘనత సంపాందించింది. చిరంజీవి రామ్ చరణ్ ఇదారితో డాన్స్ చేయటం గురించి ఏమనిపించింది అంటే రామ్ చరణ్ మంచి సహనటుడు. ఇప్పుడు నిర్మాతగా చూడటం సంతోషంగా వుంది. ఐటెం సాంగ్స్ చేస్తారా స్టార్ హీరోస్ చిత్రాల్లో అని అడిగితే ముందస్తు నిర్ణయాలు ఏవీ లేవు అవసరం అవకాశం అంతేనంది ఈ గడుసమ్మాయి.అంతే కాదు ఎడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే స్కై డ్రైవింగ్ డీప్ సి డ్రైవింగ్ చేశాను . బంగీ జంప్ అంటే మాత్రం చాలా భయం అలంటి వంటరి ప్రయాణాలు కూడా ఇష్టం లేదంది. ఇక మంచి సలహాలు ఇచ్చేది మటుకు వాళ్ళ అమ్మేనని ఆమె క్రమశిక్షణ గల తల్లిగా తీర్పులు ఇచ్చి విసిగించని ఉత్తమ స్నేహితురాలిగా తన రోల్ మోడల్ గా ఉంటుందని చెప్పింది కాజల్. ఈతరం సినిమా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే వాళ్లకు కొత్త కధలు కావాలి. చాలా హార్డ్ వర్క్ తోనే వాళ్ళ అభిమానం పొందగలం అంటోంది కాజల్ అగర్వాల్.
Categories
Gagana

అవసరం అవాకాశం వస్తే ఐటెం సాంగ్స్ ఓకే

February 28, 2017
0 mins read
చక్కని తీరైన కనుముక్కు తీరు ఒక ఒద్దికైనా రూపం హుందాగా ఉండే వస్త్ర…
Read more
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ లో తనదైన ఓ స్టయిల్ లో సాగుతోంది. హెయిర్ స్టయిల్ వస్త్రాలంకరణ మార్చేస్తూ రూపంలో రోజుకో ప్రత్యేకత చూపిస్తోందామె. చక్కని చర్మం విల్లులా వంగిన కనుబొమ్మలు చక్కని కనురెప్పలు ఆమె ప్రత్యేకత. ఈ మధ్య కాలంలోని కొన్ని డ్రెస్ లు ఆమె ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్లు ఫిష్ టెయిల్ జడను స్టయిల్ గా అల్లేసి భుజాలపైకి వదిలేస్తే ఇంకో రోజు ఎల్లో కలర్ స్ట్రాప్ లేస్ జార్జెట్ గౌన్ ను పోనీతో ఎర్రని పెదాలతో అన్ మ్యాచ్డ్ అయినా డోంట్ కేర్ అన్నట్లు చూస్తోంది. డీప్ చాక్లేట్ బ్రౌన్ లిప్స్ మెటాలిక్ గ్లాస్ మెరుపులా జుట్టుతో అదే కలర్ డ్రెస్ తో స్టన్నింగ్ గా కనిపిస్తోంది. వస్త్రధారణకు అనువుగా హెయిర్ స్టయిల్ మేకప్ ఎలా చేసుకోవాలో మెళుకువలు తెలిస్తే ఎవరైనా అందాల కొండల్లాగే వుంటారు. ప్రియాంక ఫ్యాషన్ ఐకాన్. ఎవరైనా ఆమె సీక్రెట్ ను తెలుసుకోవచ్చు. అంటే తాము ఎలా వుంటారో గుర్తించ గలిగితే తమకేది మ్యాచ్ అవుతుందో తెలుసుకోగలుగుతారు.
Categories
Gagana

అందానికి ప్రతిబింబం ప్రియాంక

February 25, 2017February 25, 2017
0 mins read
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకో ఇమేజ్ సృష్టించుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్…
Read more
సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్ చేస్తున్న సమయం ఇది. ఈ మధ్య ఒక సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగింది. అలా బొద్దుగా ముద్దుగా ఉన్న అనుష్క ఆ సినిమా కాన్సెప్ట్ వరకు బావుంది. ఇంకా ఆ తర్వాత ఆ పెరిగిన బరువు తగ్గించుకోవటం అనుష్క కి చాలా కష్టం అయిందట. సింగం 3 నమో వెంకటేశాయ లో అనుష్కను చుస్తే అభిమానులకు చాలా నిరాశ కలిగిందని కామెంట్స్ వచ్చాయి . కానీ తమాషా గా బాహుబలి - 2పోస్టర్ తో అనుష్క చాలా అందంగా వుంది. కానీ సినిమా లేటయిపోతుందనే భయంతో అనుష్కను గ్రాఫిక్స్ తో చక్కగా మార్చేశారని టాక్. గ్రాఫిక్స్ తో ఎలాంటి అద్భుతాలైన చేయచ్చని దానికి అనుష్క ఒక లైవ్ ఉదాహరణ అని చెపుతున్నారు. ఇది అమ్మాయిలకో హెచ్చరిక. మొదటినుంచి యుక్త వయసు వచ్చిన దగ్గరనుంచి ఒక తీరైన సౌందర్యం తో ఉండాలంటే ముందుగా తినే వాటిపైన దృష్టి పెట్టాలని బరువు చూసుకుంటూ మితంగా మాత్రమే తింటూ నోటికీ కళ్ళకీ రుచి ఇచ్చే తియ్యని పదార్ధాలకు వీడ్కోలు చెపుతూ ఆరోగ్యంగా ఉండండంటున్నారు డైటీషియన్లు.
Categories
Gagana

స్వీటీ ముచ్చట ఇదే

February 25, 2017
1 min read
సినిమా విజయాల కోసం హీరో హీరోయిన్స్ ఎన్నెన్నో ఎక్సపెరిమెంట్  చేస్తున్న సమయం ఇది.…
Read more

Posts navigation

Previous 1 … 335 336 337 … 354 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.