Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

4220 Articles
డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.
Categories
Gagana

ఎయిడ్స్ పై పోరాటం

January 27, 2017January 27, 2017
0 mins read
డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన…
Read more
భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.
Categories
Gagana

ఉచిత వైద్యానికీ గుర్తింపు

January 27, 2017
0 mins read
భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు.…
Read more
సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.
Categories
Gagana

సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత

January 25, 2017
0 mins read
సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు…
Read more
గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని ఎప్పుడో చేసేవి. అంతే తప్ప ఏ హీరోయినూ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయరు. కొంత కాలం క్రితం ఒప్పుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి. పైగా స్టార్ హీరోలు చిన్న హీరోలు యువ కధానాయకులా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కధ నచ్చితేనే సినిమా. నా అభిమానులు నొచ్చుకోకుండా ఉండేటట్లు కథలుంటే బావుండనుకుంటా. ఇప్పుడు నాకు ఫేస్ బుక్ అభిమానులే 60 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మనసులో నాకు స్థానం ఉండటం కంటే ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? నేనెప్పుడూ సక్సెసే అనుకుంటానంటోంది హన్సిక. చిన్న వారులో సినిమాలోకొచ్చాను. ఇది పూర్తిగా నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలేని రోజుని నేనెప్పటికీ ఊహించలేనంటోంది హన్సిక.
Categories
Gagana

ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

January 25, 2017
0 mins read
గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ…
Read more
నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు. వయసు పెరిగితే డిప్రెషన్ అంటారు. ఇంకా జీవితం చుట్టూ ఎన్నో కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి మన మనసు సంతోషపడే కార్యక్రమం ఎంచుకోవాలి. జర్మన్ మహిళ పెట్రా ఏంజిల్స్ చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే అక్షరాలు చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో రంగుల్లో ఆకారాల్లో వస్తున్న ఎరేజర్స్ ని 112 దేశాలకు సంబంధించి 19571 కలెక్ట్ చేసింది. ఒక్కరోజులో ఇది సాధ్యమా ? ఒక సరదా . అలా సంపాదించినందుకు ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. ఆలోచించండి. అన్ని ఎరేజర్స్ సంపాదించటం అంత తేలికా.. ఆ గౌరవం దక్కటమూ అంత తేలిక కాదు. ఇంకో ఆమె జర్మనీకి చెందినదే. పేరు మార్చినా షెల్లేన్ బెర్గ్. నాప్కిన్స్ కలెక్ట్ చేసింది. రకరకాల చేతులు తుడుచుకునే నాప్ కీన్స్ లక్షా ఇరవై ఐదు వేలకు పైగా సేకరించి గిన్నీస్ లోచోటు సంపాదించింది. జీవితం నిండుగా ఉండాలంటే మనం ఇతరులకి భారమై బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎదో ఒక హాబీ అలవర్చుకోవాలి.
Categories
Gagana

ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

January 25, 2017
0 mins read
నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా…
Read more
ఏ అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి కాపాడుకొన్నట్లు ప్రతిబందాన్ని కాపాడుకోవాలి. శృతిహాసన్ కూడా ఇదే చెపుతోంది. కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తం. ఎక్కువ రాజీపడాలో ఎక్కడ పడితేనే బావుంటుంది. బంధాలను కాపాడుకోవలిసిన విషయంలో రాజీపడాలి. గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. స్నేహంలో అయినా వివాహ బంధంలో అయినా ఒకప్పుడు రాజీలుండేవి. ఇప్పుడిలా లేవు కనుకనే విడిపోవటాలు ఎక్కువైపోతున్నాయి. ఒక చిన్న రాజీ వల్ల బంధం నిలబడితే కట్టుబడాలి. లేదా ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందుల పాతేనని తేలితే ఎప్పుడు రాజీల మాటే వద్దు. అంటోంది. రేలషన్ షిప్స్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ ఇప్పటిదంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చటుక్కున తినేయాలి. చిటుక్కున పనిలో పడిపోవాలి. అంతే వేగం బంధాలకు ప్రాధాన్యత ఇవ్వలేనంత వేగం. ఈజీగా లవ్ లో అసలు అంత సులువుగా విడిపోవటం మొత్తం మీద అసలు బంధాలకు విలువే లేకుండా పోతుంది అంటుందామె. ఎదిగే వయసులో మొత్తం చూసిందంతా ఇదే ఈ అమ్మాయి. మానవ సంబంధాలకు గురించి శృతి కంటే చక్కగా చెప్పగలిగేదెవరు ?
Categories
Gagana

రాజీ పడకుంటే సమస్య

January 24, 2017
0 mins read
ఏ  అనుభంధమైనా ఎప్పుడూ సెన్సిటివ్ గా ఉంటుంది. రెపరెపలాడే దీపానికి చేతులడ్డం పెట్టి…
Read more
హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. తెర పైన అందంగా కనిపించాలంటే వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. పాత్ర స్వభావాన్ని బట్టి కిలోల కొద్దీ బరువైన నగలు దుస్తులు ధరిస్తారు. ఈ మధ్య విడుదలకు సిద్ధమైన కాబిల్ సినిమాలు సారా జమానా అనే ఐటెం సాంగ్ కోసం ఊర్వశీ రౌతీలా అన్న హీరోయిన్ 150 కిలోల బరువున్న కాస్త్యుమ్ వేసుకుని షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఆ దుస్తుల బరువుకు కిందపడిపోయిందట. ఇలాంటి అనుభవాలు ఎంతో మంది హీరోయిన్స్ కి కూడా ఉన్నాయి. దీపికా పడుకునే రామ్ లీలా లో 130 కిలోల బరువున్న గాగ్రా బాజీరావ్ మస్తానీ లో 20 కిలోల బరువున్న కాస్ట్యూమ్స్ వేసుకుంది. ఐశ్వర్య రాయ్ జోధా అక్బర్ లో 30 కిలోల దేవదాస్ లో మాధురీ దీక్షిత్ 30 కిలోలున్న దుస్తులు వేసుకుని తంటాలుపడితే అనుష్కా శర్మ శ్రీదేవి లు కూడా బరువైన నగలు దుస్తులు వేసుకుని ఆపసోపాలు పడ్డవారే.తెరపైన కేవలం అందం అభినయంతో ఆకట్టుకోవడం కాదు. ఇంతింత బరువైన దుస్తులు వేసుకోవటం ఛాలెంజ్ అంటారు వీళ్లంతా !!
Categories
Gagana

దుస్తుల బరువుతో పడిపోయింది

January 23, 2017
0 mins read
హీరోయిన్స్ తెరపైన కనిపించగానే ఒక్క క్షణంలో బావున్నరానో బాలేరనో ఒక స్టేట్ మెంట్…
Read more
సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్ ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన ఫ్యాషన్ స్టయిల్ గురించి చెప్పే పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది పూజా. ఈ సినిమా తర్వాత మీడియా విమర్శకులు ప్రసరించారు. మంచి సమీక్షలొచ్చాయి. మంచి స్క్రిప్ట్ దొరికితే షార్ట్ లు టీ షర్టులు వేసుకుని సెట్ కు పది నిమిషాల్లో తయారై పోగల సినిమా చేయాలని వుంది. మొహెంజెదారో సినిమాలో ప్రతి సెట్ కి కాస్ట్యూమ్స్ ధరించటానికి అరగంట పట్టేది. పైగా నాకు ఎక్కువ మేకప్ ఇష్టం ఉండదు. అలా తేలిగ్గా ఉండగలిగే సినిమా కోసం చూస్తున్నానంటోంది పూజా. కానీ ఇది తన అభిప్రాయం మాత్రమేనని ఈ రోజుల్లో సినిమాలకు వార్డ్ రోబ్ కు గొప్ప గొప్ప ప్రాముఖ్యం వుంది. అత్యంత స్టయిల్ గా ఉండాలి. వీలైతే మొహెంజెదారో లో లాగా హెవీ లుక్ తోనే ఉండాలి సినిమా ఆషామాషీ కానుకగా అంటోంది పూజా .
Categories
Gagana

అందం అంటే అత్యంత స్టయిల్ గా ఉండటం

January 21, 2017
0 mins read
సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్…
Read more
ఫలానా అని ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా ఈమెది బంగారు పాద ముద్ర స్థాయికి చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో తెలుగులో కాటమరాయుడు మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే నేనెప్పుడూ తెలుగు చిత్ర సీమకు రుణపడిఉంటానంటోంది శృతి హాసన్. ఒకప్పుడు నన్ను ఐరెన్ లెగ్ అన్నారు ఇవ్వాళ స్టార్ హీరోయిన్ అంటున్నారు. మా నాన్న దగ్గర నుండి అమ్మ దగ్గర నుండి నేను ఫీల్డ్ ను చూస్తూనే ఉన్నా. వాళ్ళ లాగే నేనూ భాషా బేధాలతో కెరీర్ ను చూడలేదు. న దృష్టలో సినిమాకు భాష లేదు. అలా అనుకుంటే అసలు మాటలే లేని పుష్పక విమానంలో మా నాన్న ఎలా సక్సెస్ సంపాదించాడు. అంటోంది శృతి. తాను తానుగా స్టార్ గా ఎదగటం ఒక్కటే తాను ఆనందించే విషయం అంటోంది శృతి హాసన్.
Categories
Gagana

సినిమాలకు భాషా బేధం ఏమిటి ?

January 21, 2017
1 min read
ఫలానా అని  ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా   ఈమెది బంగారు పాద  ముద్ర స్థాయికి…
Read more
మాఫలానీ క్రీమ్ రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్ అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వచేసుకున్న అని చెపుతోంది. యామీ గౌతమ్ . ఇంకోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యామీ గౌతమ్ జంటగా నటిస్తున్న కాబిల్ చిత్రం తెలుగులో బలం పేరుతో విడుదల కానుంది. సంజయ్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ చిత్రంలో హృతిక్ యామీ అంధులుగా నటించారు ఈ సినిమా ఈనెల 26 న విడుదలౌతుంది.
Categories
Gagana

విలన్ పాత్రలో యామీ గౌతమ్

January 20, 2017
0 mins read
మాఫలానీ  క్రీమ్  రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో…
Read more
నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్ తో బాహుబలి లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి నాగార్జున రాఘవేంద్ర రావులతో ఓం నమో వెంకటేశాయ . అన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. ఈ నాలుగు నెక్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతాయి. సింగం ఒకటి రెండు ఇప్పుడు మూడు సినిమాల్లో అనుసఙ్కా జోడీగా నటించింది. ఇప్పటి సింగం 3 లో అనుష్క తో హీరోయిన్ శ్రుతీ హాసన్ కూడా కలిసి నటిస్తోంది. శృతికి ఇందులో గ్లామరస్ పాత్ర యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయిట. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించటం వల్లనా ఏమో అనుష్క భుజాలపై సినిమా మొత్తం హీరోల మాదిరి మోయటం నేర్చుకొన్నదనీ అందుకే సినిమా సినిమాకు గెటప్ శరీరం నాజూకుతనం చూపిస్తుందని ఇందుకు సైజ్ జీరో ఉదాహరణ చాలుననీ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసుకున్న సత్యం అనుష్క అందమైనదే కాదు. నిజమైన యాక్టర్ .
Categories
Gagana

టాప్ హీరోస్ కంటే ఎక్కువ ఈమె

January 20, 2017
0 mins read
నాలుగు సినిమాలలో ఎంతో బిజీగా వున్నానంటోంది అనుష్క. సూర్యతో సింగం 3 ప్రభాస్…
Read more
అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే విషయంలో శ్రద్ధ చూపించాలని తెలుసుకొన్నానంటోంది తమన్నా. నాలుగైదు సినిమాలు చేస్తే కనీసం ఒక్కటైనా పేరు తెచ్చేదిగా వుండాలని అనిపించింది. ఆ వ్యూహం ఫలించింది ఇప్పుడు రాబోయే బాహుబలి విషయంలో నేను ఇటు మంచి కధ. అందంగా కనిపించటం ముఖ్యంగా నాలో ఒక నటి వుండటం ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అన్నదామె. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. మంచి నటన కనబరచగలిగినవాళ్లు ఓమెట్టుపైన వుంటున్నారు. ఇవాళ్టి అమ్మాయిలు ఖచ్చితంగా తమకు పేరు తెచ్చిపెట్టే మంచి కధ బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు గుర్తించానంటోంది తమన్నా. తొలినాళ్లలోనే నటన ప్రాధాన్యమేమిటో తెలిసొచ్చింది. నేనందంగా ఉన్నానని నాకు గుర్తింపు రావటం నాకు సంతోషమే. కానీ గురించి నటిగా గుర్తింపు వస్తే అది నా అదృష్టంగా భావిస్తానంటోంది తమన్నా. బాహౌబలి - 2 త్వరలోనే రాబోతోంది. ఇందులో తమన్నా అందమా ? నటనా ? ప్రేక్షకులే నిర్ణయించాలి.
Categories
Gagana

మంచి కథ అయితే గొప్ప పేరొస్తుంది.

January 20, 2017
1 min read
అందం అభినయం ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. కధలు ఎంపిక చేసుకునే…
Read more

Posts navigation

Previous 1 … 339 340 341 … 352 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.