Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

4184 Articles
ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని విమెన్స్ హెల్ప్ ప్రారంబించి ఆ బాధ్యత స్మితకు అప్పగించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అతి సాదరణమైన ఉద్యోగంలో వున్న ఇంత మందికి స్పూర్తిగా నిలబడినందుకు స్మిత సల్యుట్ చేయాల్సిందే.
Categories
Gagana

ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

November 3, 2016
0 mins read
ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల…
Read more
ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు......కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. పూర్తి పాఠం విశేషాలు వెబ్ సైట్ లో చూడొచ్చు. మన గురించి ఏం చెప్పుకొవాలో ఏం తెలుసుకోవాలో ఇలాంటి సమావేశాల్లో అర్ధం అవుతుంది.
Categories
Gagana

ఐరాస మహిళ ఐశ్వర్య

November 2, 2016
0 mins read
ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి…
Read more
నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని చదివాక ఆయన గురించి ఎంతో స్టడీ చేసింది. గాంధీ తిరిగిన దక్షిణాఫ్రిక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ తిరిగి ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆయన వాల్ల ప్రభావితులైన వ్యక్తులను కలుసుకుంది. గాంధీ సత్యశోధనలోని విషయాలు ఇతర చిత్రకారులతో కలిసి బొమ్మలు వేసి టేల్స్ ఆఫ్ యంగ్ గాంధీ పేరు తో ఆధునిక గ్రాఫిక్స్ నవలగా తీసుకొస్తుంది. రాజ ప్రసాదంలో ఆడంబరంగా జీవించాల్సిన ఈ అమ్మాయి నిరాడంబరమైన గాంధేయ మార్గం అంటే ఎంతో ఇష్టం.
Categories
Gagana

ఈ జమిందారు కూతురికి గాంధేయ మార్గం ఇష్టం

October 29, 2016
0 mins read
నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ…
Read more
ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్ వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్ చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు పండ్లు ఉద్యానవన పంటలు అంతర పంటలకు సంబంధించి 400 రకాల విత్తనాలు రైతుల కోసం పంపిణీ చేస్తారు. ప్రత్యక్షంగా రైతులను కలిసి మంచి విత్తనాలు సేకరించి గిట్టు బాటు ధర చెల్లిస్తారు. ఇలాంటి వాళ్ళను తలుచుకుంటే ఏదైనా కొత్త పని చేయాలనిపిస్తుందేమో కదా !
Categories
Gagana

మొక్కల వ్యాపారం చేస్తుంది గీతాంజలి

October 28, 2016October 28, 2016
0 mins read
ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని…
Read more
నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్ నిలదోక్కుకు రావడం చాలా కష్టం కానీ నుజ్రెల్ పూల వ్యాపారంలో నిలదొక్కుకుంది. 'పెతల్స్ అండ్ ఫేర్న్స్' దగ్గరనుంచి కష్మీరి ఎస్సెన్స్ దాక పువ్వుల ఉత్పత్తులే ఆమె బిజినెస్ సాంప్రదాయ ఉత్పత్తులే ఆమె బిజినెస్. సాంప్రదాయ ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, బాదాం, చెర్రి, వాల్ నట్స్, యాపిల్, ఆలివ్, అప్రికాట్ మంచి, హ్యాండ్ మేడ్ సోప్స్, స్కిన్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆరోమేటిక్ ఆయిల్స్ అన్ని ఈమె కంపెనీ లో తయారు అవుతాయి. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటుంది నుజ్రత్. ఈమె విజయగధను యువర్ స్టొరీ కామ్ లో పూర్తిగా చదువుకోవచ్చు.
Categories
Gagana

ఆమె బిజినెస్ విరగబూసస్తోంది

October 27, 2016October 27, 2016
1 min read
నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్…
Read more
యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్ రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం. ఈ గొంతు సరళా చౌదరిది. 1982 లో ముంబై లోని సెంట్రల్ రైల్వే ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అందులో సరళా చౌదరి కూడా ఉన్నారు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు. సరళా చౌదరి ప్రతి ప్రకటననూ చదివి వినిపించేవాళ్ళు. తర్వాత టి. ఎం. ఎస్ వచ్చాక కొన్ని వేల అనౌన్స్మెంట్స్ సరళా చౌదరి తన గొంతుతో రికార్డ్ చేస్తే రైల్వే అధికారులు టి.ఎం.ఎస్ కు అనుసంధానించి ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్ వచ్చేలా ఏర్పాటు చేసారు. సరళా చౌదరి ఇప్పుడు రిటైర్ అయ్యారు. కానీ ఎప్పుడైనా స్టేషన్ కు వెళితే తన గొంతు తానే వింటానని చెప్తారు.
Categories
Gagana

ఆ గొంతు ఎంతమంది విన్నారు

October 27, 2016
0 mins read
యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్…
Read more
సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా లో ఖరీదైన ఇళ్ల మార్కెట్ లోకి ప్రవేశించారు. రెవెన్యూ 22 శాతం లాభాలు 79 శాతం పెంచగలిగారు. మార్కెట్లో 2230 కోట్లు సేకరించగలిగారు. ఇది అనిత అర్జున్ రావ్ సమర్ధత. భారత దెస వ్యాపార వాణిజ్య రంగాల్లోని శక్తిమంతమైన మహిళల్లో ఈమె ఒకరు.
Categories
Gagana

సొంత ఇంటి కళను నిజం చేసిన అనిత

October 27, 2016
0 mins read
సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు…
Read more
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి లక్ష్యం. భారతీయ ఐటీ కంపెనీ సీఈఓ పురుషులే. ఒక్క క్యాప్ జెమినీ మాత్రం మహిళా సీఈఓ అరుణ ఉన్నారు. ఈ సీఈఓ అయ్యానంటే నా శక్తి సామర్ధ్యాలే. మహిళ నేనే ఈ హోదా ఇచ్చారని చెపితే ఈ క్షణం తప్పుకుంటాను అంటారు జయంతి.
Categories
Gagana

నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను

October 27, 2016October 27, 2016
0 mins read
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా…
Read more
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.
Categories
Gagana

దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

October 27, 2016
0 mins read
13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో…
Read more
యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్ప కారిణి దేవికా దేవి.
Categories
Gagana

60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి

October 27, 2016
0 mins read
యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్…
Read more
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా ఉన్నారు. వారణాసి ,బీహార్ ,ఒరిస్సా లోని సంప్రదాయ డిజైన్లకు ప్రచారం తీసుకొచ్చారు. రీతూకుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంతం అంటూ ఉండదు అంటారామె. ఆన్ లైన్లో ఆమె డిజైన్స్ కళ్ళు చెదిరేలా వుంటాయి. లక్షరూపాయల పైమాటే ఒక్కో చీర. బెనారెసీ ,ఒవేన్ రెడ్ గోల్డెన్ శారీస్ , రిచ్ గోల్డెన్ శారీ, ఎమరాల్డ్ మిర్రర్ వర్క్ శారీస్ , కోరల్ ఎంబ్రాయిడరీ చీరలు ఐవరీ గోటూ బ్లింక్ ఎంబ్రాయిడరీ చీరలు ఇవన్నీ రియల్ జరీ వర్క్ లు , రాయల్ లుక్ తో పార్టీలకు ,పెళ్లిళ్లకు, ఫెస్టివల్స్ కు రైట్ అవుట్ ఫిట్స్ కుర్తీలు ,సూట్స్ ,శారీస్ ,బాటమ్స్ , లెహెంగాస్ ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ చేతుల్లోంచి ఫ్యాషన్ వీక్ లో మెరిసి అమ్మాయిల కళ్ళలో పడిపోయి బెస్ట్ సెల్లింగ్ అయిపోతాయి.
Categories
Gagana

ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్

October 25, 2016October 25, 2016
0 mins read
మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా…
Read more
ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన టాటా డోకొమో,యూనిలివర్, లోరియల్ వంటివి ఫేస్ బుక్ ద్వారానే వినియోగ దారునికి చేరుతున్నాయి. వారి అనుబంధ సంస్థల అమ్మకాలు మార్కెటింగ్ టీమ్లను రెట్టింపుగా కొంటున్నాయి. ముంబాయి గుర్ గాన్ లో ఆఫీసులు అద్భుతంగా పని చేస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారం పెరిగేందుకు, కొత్త స్టార్ట్ అప్స్ ఫేస్ బుక్ ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ ప్రోత్సాహం మొత్తం క్రిత్తిగా రెడ్డి సమర్ధత కారణంగానే అని చెప్పడంలో సందేహం లేదు.
Categories
Gagana

ఫేస్ బుక్ తెర వెనుక…………..

October 25, 2016
0 mins read
ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో  ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య…
Read more

Posts navigation

Previous 1 … 347 348 349 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.