Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: WhatsApp

12553 Articles
ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు తమ కోపాన్ని వ్యక్తం చేసే మార్గాల్ని వెతకమంటున్నారు. పిల్లల్ని భయాందోళనలకు గురిచేయద్దు. మీ సమస్యలకు ఒక పేపర్ పై రాసి పరస్పరం ఇచ్చుకోండి. ఇది పిల్లల వరకు వెళ్ళదు కనుక ప్రాబ్లమ్ లేదు. లేదా ఎంత ఉద్వేగం వచ్చినా పిల్లల ముందు బయటపడకుండా వాటిని గురించి వాళ్ళు లేనప్పుడే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ ముందు మౌనంగా అయినా వుండండి. భార్య భర్తలు తల్లి తండ్రుల పాత్రలోకి వచ్చాక వాళ్లకు బాధ్యత ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించమంటున్నారు నిపుణులు .
Categories
WhatsApp

వాళ్ళు ఆందోళన పడతారు. జాగ్రత్త

March 1, 2017
0 mins read
ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు…
Read more
అద్దంలో చూసుకుంటూ నేను భలే బాగున్నాను. నేను చాలా అందమైన దాన్ని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సంతృప్తి పడటం ఎంతో మంచిదనీ ఇలా అనుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే ఎన్నో రకాల వడిదుడుకుల్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మానసిక ధైర్యం ఉంటుందనీ చెపుతోంది ఒక పరిశోధన ఎలాగంటే తమ రూపం బరువు పట్ల సంతృప్తిగా ఉన్నవాళ్లకి ఆనందంగా వుంటుందనీ వాళ్ళకి జీవితంలో నిరాశ సంతృప్తి ఎదురవదనీ ఒక వేళ ఎదురైనా తమకుండే పాజిటివ్ ఫీలింగ్ తో ప్రతి కష్టాన్ని ఎదుర్కొటారనీ చెడుతున్నారు. 12 వేల మందిపై జరిపిన పరిశోధన ఫలితం ఇది. వాళ్ళ వ్యక్తిత్వము దాంపత్య జీవితము గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారట. అందుకనే సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయి. ఆర్ధిక స్థితి దాంపత్య జీవితం కుటుంబం స్నేహాలు అన్నింటి పట్ల సంతృప్తిగానే ఉన్నారు వాళ్లు తగు రూపాన్ని ప్రేమించుకోలేనివాళ్ళు తమపట్ల తమకే నమ్మకం లేనివాళ్లుగా ఉంటారనీ కనుక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చాలా మంచిదనీ సర్వే రిపోర్ట్. కరెక్ట్ అనిపిస్తోంది కదూ.
Categories
WhatsApp

నేనెంతో అందమైన దాన్ని

March 1, 2017
1 min read
అద్దంలో చూసుకుంటూ నేను భలే బాగున్నాను. నేను చాలా అందమైన దాన్ని అనుకునేవాళ్లు…
Read more
ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా ఒకటి. వేసవి వస్తోందంటే పుదీనా షర్బత్ పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగి తేటగా వుంటారు. ఇందులో మెంథాల్ కారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గుమొహం పడతాయి. పుదీనా ఆకులు నోటిని శ్వాసనీ తాజాగా ఉంచుతాయి. దోమ కాట్లకు దద్దుర్లకు ఇతరత్రా అలర్జీలకు పుదీనా తో చేసిన నూనె ఎంతో ఉపయోగం. ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు అంటే మనకు కూరగాయలు పండ్లే గుర్తొస్తాయి. కానీ పుదీనా లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు గాను యాంటీ ఇన్ఫలమేటరీ గానూ పనిచేసే మారినిక్ ఆమ్లం పుదీనాలో వుంది . ఇది అలర్జీలు తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెంథాల్ శేష్మం తగ్గిస్తుంది. దీనితో చేసిన టీ తాగటం వల్ల గొంతు నొప్పులు తగ్గుతాయి. అజీర్తిని గ్యాస్ట్రిక్ సమస్యని త్రేపుల్ని నిరోధిస్తుంది. పుదీనా టీ బడలికను కూడా తగ్గిస్తుంది. పుదీనా పచ్చడి రుచి గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చటం ఉత్తమం.
Categories
Wahrevaa

పుదీనా లో ఏముందీ ?

March 1, 2017
0 mins read
ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా…
Read more
వేసవి వస్తే ఎండల భయం ఉంటుంది. మల్లెల సుగంధం మనసుని పరవళ్లు తొక్కిస్తుంది. మాఘ మాసం నుండి మొదలై ఆషాఢ జల్లుల వరకు పలకరించే ఈ అద్భుతమైన మల్లెల సౌరభాలంటే అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా జాస్మిన్ జల్లులు ఎన్నో ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినం సంబర్.దీన్నే అరేబియన్ జాస్మిన్ మల్లికా కుండ మల్లిగై మోగ్రా అంటూ అనేక రకాల పేర్లతో పిలుస్తారు. పూలరేకులు పరిమళం బట్టి కూడా ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరసలో ఐదు అంతకంటే ఎక్కువ రేకులతో ఉండేదే బొండుమల్లి గుండుమల్లి రేఖ మల్లి అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూసే మల్లెలుంటాయి. చూసేందుకు చిన్న గులాబిల్లా ముద్దుగా వుండే రోజ్ జాస్మిన్ లేదా నెంటు మల్లె అంటారు. దొంతర మల్లెల్లో పూరేకులు అరలు అరలుగా ఉంటాయి. మాఘ మల్లికా స్టార్ జాస్మిన్ అని పిలిచే మల్లియలు ఆకు కనిపించకుండా మొత్తం తెల్లగా పూసేస్తాయి. ఇవే కాదు నేల తీరు వాతావరణం బట్టి ఒక్కో మల్లె మొగ్గది ఒక్కోఅందం. ఒక్కో మధురమైన పరిమళం. ఈ మధ్యనే పేటెంట్ పొందిన మధురై మల్లెలు మీనాక్షి అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఆమెను అలంకరించేది ఈ మల్లెలతోనే . అసలే అందమైన మీనాక్షి దేవి విగ్రహంపైన మల్లెల మాలలు అందమే అందం.
Categories
WhatsApp

మల్లె విరిసే వేళలు

March 1, 2017March 1, 2017
1 min read
వేసవి వస్తే ఎండల భయం ఉంటుంది. మల్లెల సుగంధం మనసుని పరవళ్లు తొక్కిస్తుంది.…
Read more
ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం. మానవ సహజం. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఇంతే వదల్లేనంతగా ... వాట్సాప్ ఫెస్ బుక్ ఈమెయిల్స్ పదే పదే చెక్ చేసుకోవటం ఇలాంటిదే. ఈ అలవాటు ఇష్టంతో చేస్తే అలవాటైనా సరే డిజిటల్ స్ట్రెస్ కు గురవుతారని చెపుతున్నాయి అధ్యయనాలు. ఫెస్ బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే సినిమా న్యూస్ కోసం నెట్ వెతుకుతూనే ఉంటారు. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉందని నిపుణులు చెపుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పరిశోధన మొదలైంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ ను పక్కనే ఉంచుకునే వాళ్ళు 80 శాతం నిద్రపోయే ముందర కూడా దాన్ని వదిలిపెట్టని వాళ్ళ శాతం కూడా తక్కవగా ఏం లేదు. 60శాతం, మంది తల్లి తండ్రులే పిల్లలకు ట్యాబ్ లు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని రిపోర్ట్. ఏది ఎలాగైనా అతిగా వాడటం వల్ల జరిగే ముప్పే ఎక్కువంటున్నాయి అధ్యయనాలు.
Categories
WhatsApp

వీటి వాడకంలో నష్టం ఎక్కువ

February 28, 2017
0 mins read
ఇష్టమైన ప్రతిదాన్ని మనసుకు దగ్గరగా తీసుకుంటాం. చాలా అతిగా ఓన్ చేసుకోవాలని చూస్తాం.…
Read more
మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. యోగా తో అలర్జీ పై పోరాడే శక్తీ శరీరానికి సమకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మనసుకి కావాల్సిన రిలాక్సేషన్ అందుతుంది. డిప్రెషన్ తోబాధపడేవారికి యోగా మంచి ఉపశమనం. ఏ రకంగా చూసినా యోగాతో మెరుగైన ప్రయోజనాలున్నాయి. మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. ఉదయాన్నే ప్రాణాయామం చేస్తే శరీర వ్యవస్థ మొత్తం ఉత్తేజితం అవుతుంది. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు కార్టిసాల్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. యోగా తో అలర్జీ పై పోరాడే శక్తీ శరీరానికి సమకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మనసుకి కావాల్సిన రిలాక్సేషన్ అందుతుంది. డిప్రెషన్ తోబాధపడేవారికి యోగా మంచి ఉపశమనం. ఏ రకంగా చూసినా యోగాతో మెరుగైన ప్రయోజనాలున్నాయి.
Categories
WhatsApp

వ్యాయామం కంటే యోగా బెస్ట్

February 28, 2017
1 min read
మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం…
Read more
ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే ఉండాలనిపిస్తోంది. మనం సాధారణంగా మంచి హోటల్స్ వెతుక్కుని వెళతాం. అంటే ఖరీదైన వ్యవహారం ఆహరం అన్నీ ఉంటాయి. అయినా ఒక్కసారి ఆ టిఫినో భోజనమో తర్వాత స్టమక్ అప్సెట్ అవుతోంది. ఫుడ్ పాయిజనింగ్ అన్నంత దూరం పోతుంది. అందరికీ సరిపడిన ఆహారం మనకెందుకు ప్రాబ్లమ్ అయిందో అర్ధం కాదు. ఇప్పుడిక డాక్టర్ల నివేదికవచ్చింది. హోటల్లో వుండే మెనూ కార్డుల్లో వుండే క్రీములు మురికి టాయ్ లెట్ నీట్ కవర్ పైన కూడా ఉండదట. డాక్టర్లు ఏం చెపుతున్నారంటే హోటల్ కు వెళ్ళగానే మెనూ కార్డు చూసి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చేసి వెంటనే పోయి వాష్ చేసిన దగ్గర శుభ్రంగా చేతులు కడుక్కోమంటున్నారు. కుర్చీలు బల్లలు కింద నెల ఎప్పుడు శుభ్రపరుస్తారు కానీ ఈ ప్లాస్టిక్ లేమినేటెడ్ మెనూ కార్డ్స్ వైపు ఎప్పుడూ పట్టించుకోరని హోటల్స్ లో వుండే బాత్ రూమ్స్ హ్యాండిల్స్ గ్లాస్ డోర్స్ అన్నీ క్రిములు మాయం అంటున్నారు . ఒక చిన్న లింక్ ఇచ్చారు కదా మిగతా అంతా ఊహించి హోటల్స్ కు వెళ్లకుండా ఎలా వుండగలమో ఆలోచించాలి.
Categories
WhatsApp

మెనూ కార్ట్స్ యమ డర్టీ

February 28, 2017
0 mins read
ఇలాంటివి వింటే ఇక ప్రతిదానికీ ఉలిక్కిపడుతూనే  ఉండాలనిపిస్తోంది. మనం  సాధారణంగా మంచి హోటల్స్…
Read more
Categories
WhatsApp

మెరుగైన జీవితం కోసం నడక

February 28, 2017February 28, 2017
0 mins read
నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల  కండరాలు నొప్పులు రాకపోగా…
Read more
పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని సరైన సమయంలో ఉపయోగించి పిల్లల్ని జీవితపు విలువలు పాటించేలా ఉత్తమ పౌరులుగా పెంచుకోవచ్చు. ముందుగా వారికీ మనపై నమ్మకం కలిగేలా పెద్దలు ప్రవర్తించాలి . తమ క్షేమం కోరేది తల్లి తండ్రులే నన్న భావన పిల్లల్లో కలిగితే ఒక పెద్ద పని అయినట్లే. అలాగే పిల్లలు మంచి పని చేస్తే తప్పని సరిగా పొగడాలి. ఆ పొగడ్త వారిని మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రోత్సాహం. అలాగే వారిని సంతోషపెట్టే ఒక చిన్న బహుమతి. పిల్లలు ఈ రెండింటితో తమలో ఉండే దుడుకుతనం సగం తగ్గించుకుంటారు. పెద్దలు నచ్చేలా మెలిగి ఆనందపెట్టాలనుకుంటారు. అలాగే ప్రతి చిన్న పొరపాటుని సమర్ధించవద్దు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది ఎందుకు తప్పో ఆలా చేయటంవల్ల ఎవరికీ ఎందుకు నష్టమో అసలు తప్పు ఎందుకు చేయకూడదు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే ఓర్పు నేర్పు తల్లి తండ్రులకు ఉండాలి. అప్పుడు ఇచ్చే ఒక చిన్న శిక్ష పిల్లలో మార్పు తెస్తుంది. ఫలానా కారణంగా నా వల్ల పొరపాటు జరిగిందనీ దాన్ని చేయటం నష్టమనీ తెలుసుకుంటారు. ఇచ్చే శిక్షని మనసులో నిల్చుకుని కష్టం కలిగేలా ప్రవర్తించకుండా వుంటారు. తప్పు చెప్పాలి సరిదిద్దాలి. మందలించాలి. ఆ హక్కు పెద్దలకు ఉందని పిల్లవాడు నమ్మగలగాలి.
Categories
WhatsApp

ఇదంత ఆషా మాషీ ఏం కాదు

February 28, 2017
1 min read
పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు…
Read more
డిప్పన్ డాట్స్ ఐస్ క్రీమ్ ఆఫ్ ది ఫ్యూచర్ తిని చూసారా ? మన దేశంలో ఒకేసారి పన్నెండు వందలకు పైగా అప్పటి లైట్స్ ఉన్నాయిట ఈ ఫ్రోజెన్ డెజర్ట్ కోసం కర్ట్ జోన్స్ అనే మైక్రో బియోలాజిస్ట్ ఎప్పుడో ఈ స్నాక్ ఐస్ క్రీమ్ తయారీకి శ్రీకారం చుట్టాడు. ఐస్ క్రీమ్ ని గుళికల్లా చేసి ఫ్రీజ్ చేసాడట. ఈ గుళికల ఐస్ క్రీమ్ సున్నా అంటే తక్కువ ఉషోగ్రత దగ్గరే ఫ్రీజ్ అయ్యి వుంటుందట. చప్పరిస్తే కానీ కరగని గుండ్రని థెర్మోకోల్ బంతుల్లాంటి ఐస్ క్రీమ్ ని చుస్తే అవి ఐస్ క్రీమ్ అనిపించదు. గుళికలు బరువుగా ఉంటాయి క్రీమ్ శాతం అధికంగా ఉంటుంది. గాలి చొరబడని కంటైనర్లకు అత్యధిక చల్లదనం దగ్గర ఫ్రీజ్ చేస్తారు. దాంతో సాధారణ ఐస్ క్రీమ్ లు అంటే ఇందులో ఫ్లేవర్ శాతం కూడా ఎక్కువ. ఈ గుళికల ఐస్ క్రీమ్ నిల్వ చేయాలంటే చాలా చల్లదనం కావాలి. కప్పు అందుకున్న వెంటనే తినేయాలి. లేకపోతే కరిగిపోయి సాదా ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఇవి ప్రత్యేకమైన ఫ్రాంచైస్డ్ అవుట్ లెట్స్ లోనే దొరుకుతాయి . పైనాపిల్ స్ట్రా బెర్రీ వెనీలా బ్లాక్ కరెంట్ పిస్తా ఇలాచీ ఆల్ఫాన్స్ , మ్యాంగో కాఫీ ఎన్నో ఫ్లేవర్స్ లో వున్నాయి. ఏ మాల్ లోనో దొరికితే ఎంజాయ్ చేయచ్చు .
Categories
Wahrevaa

బుల్లి బుల్లి బంతుల్లాంటి ఐస్ క్రీం

February 28, 2017
0 mins read
డిప్పన్ డాట్స్ ఐస్ క్రీమ్ ఆఫ్ ది ఫ్యూచర్ తిని చూసారా ?…
Read more
Categories
Top News

ప్రేక్షకులే నా గాడ్ ఫాథర్స్

February 27, 2017February 27, 2017
0 mins read
పింక్ తర్వాత తాప్సీ  తన సినిమాల సెలక్షన్ లో మార్పు తెచ్చింది. ఆమె…
Read more
Categories
Wahrevaa

కాన్సర్ బాధితులకు అన్నీ ఉచితమే

February 27, 2017
1 min read
www. winover cancer net అనే పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేసారు…
Read more

Posts navigation

Previous 1 … 1,008 1,009 1,010 … 1,047 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.