Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: WhatsApp

12552 Articles
ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు సంక్షేమ పధకాల కోసం 1.86 లక్షల కోట్లు కేటాయించారు. అదే గత సంవత్సరం 1. 56 లక్షల కోట్లు గర్భిణుల పాలిచ్చే తల్లులకు ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగా యోజన పధకానికి 21000 కోట్లు కేటాయించారు. 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు గ్రామాల్లో మహిళా శక్తీ ఆరేళ్ళ లోపు వయసుగల పిలల్లకు 15,245 కోట్లు కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమం కోసం 1,84,632 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ మహిళల స్కెల్ డెవెలప్మెంట్ ఎంప్లాయిమెంట్ డిజిటల్ విటరసీ హెల్త్ అండ్ న్యూట్రిషన్స్ అలాగే దళిత మహిళలు గిరిజన మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఈ కేటాయించిన డబ్బులోంచే సంక్షేమ పధకాలు చేపట్టాలి. పాలకులకు ప్రజా సంక్షేమం నిజంగా పట్టినట్లయితే ఏనాడో ప్రపంచంలో మహిళలంతా ఆర్థికాభివృద్ధిని చేతుల్లకి తీసుకుని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను సమర్ధవంతంగా నడిపించుకోగలిగేవాళ్ళు . గతం వదిలేస్తే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. ఒక కొత్త ఉషోదయం వస్తుంది. రేపటి రోజు బావుంటుందని ఆశిద్దాం .
Categories
WhatsApp

మహిళా సంక్షేమానికి పెద్ద పీట

February 4, 2017
0 mins read
ఈసారి బడ్జెట్ లో మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కేటాయింపులున్నాయి. మహిళా శిశు…
Read more
బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ క్యాప్సికం కండరాల నొప్పికి మంచి ఉపశమనం. అలాగే స్వీట్ పెప్పర్ టేస్ట్ బావుండటంతో పాటు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. ఇది కారంగా ఉండదు. దృఢమైన యాంటీ ఇన్ఫలమేటరీ కారకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాప్సికం ముక్కలు 22 నుంచి 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గులను కొనే వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఏ పదార్ధం తో కలుపుకున్న రుచితో పాటు పోషకాలు దక్కుతాయి . వయసు రీత్యా వచ్చే దృష్టిలోపం కాటరాక్ట్ కాకుండా అడ్డుకోవటంలో కూడా ఇది సహకరిస్తుంది.
Categories
Wahrevaa

బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్

February 4, 2017
0 mins read
బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన  వాడకంలో…
Read more
ఆహరం విషయంలో ఎన్నెన్నో అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నేతి లోని ఫ్యాటీ యాసిడ్ పేగుల్లోని కణాలకు తగిన పోషకాలు అందించి త్వరగా జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది. కడుపునొప్పి మంట తగ్గిస్తుంది. ఆహారానికి అద్భుతమైన రుచి ఇస్తుంది, ముఖంగా శీతాకాలంలో నెయ్యిని తగుమాత్రంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి.
Categories
Wahrevaa

కొవ్వు పెంచుతుందన్న అపోహ

February 4, 2017
0 mins read
ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని…
Read more
కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్ అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య ఆహార నిపుణులు. తక్కువ క్యాలరీలతో పొట్టనిండి నట్లుగా ఆకలి ఆగిపోయేట్లు చేయటం సాధ్యమే అంటారు. ఉదయాన్నే మీగడ తీసిన పాలు పెరుగు మజ్జిగ ఉడికించిన గుడ్డు కూడా ప్రోటీన్లున్నవే. అలాగే ఆకలిలేకపోయిన వాసన కూడా రుచి చూడాలనే కోరిక కలుగజేస్తుంది. నాలుక తినాలని ఆశ పెట్టేస్తుంది. దానికి ఇంకో వాసన అంటే పుదీనా లాంటి వాసన చూస్తేనే ఆశక్తివంతమైన ఆకుల వాసన నాలుకపైనా ఉన్న రుచి గ్రహకాలను తృప్తి పరుస్తాయి. దీని వల్ల పరిమితిని మించి ఆహారం తీసుకోకపోవటం.
Categories
Wahrevaa

ఆకలికి చెక్ పెట్టె నట్స్

February 4, 2017
0 mins read
కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా…
Read more
సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ టీ లో మరిగించి గానీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయంటున్నారు . బరువు తగ్గాలనుకుంటే తినే ఆహారంలో సగంలో కాలీఫ్లవర్ వుండేలా చూసుకోమంటున్నారు. కప్పు కాలీఫ్లవర్ లో రెండే గ్రాముల పీచు 27 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకాలు బరువు అదుపు చేస్తూ జీవ క్రియ రేటును సమతుల్యం చేస్తాయి. కప్పు పచ్చి బఠాణీ లో పీచు విటమిన్లు మాంసకృత్పతులు ఉంటాయి. పుల్కా చపాతీలలో వీటిని తీసుకుంటే బఠాణీ లో వుండే పోషకాలు బరువు తగ్గిచేస్తాయి.
Categories
Wahrevaa

చీపనుకుంటాం కానీ ఇవే బెస్ట్

February 3, 2017
1 min read
సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది…
Read more
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది . ఇప్పుడు అవా యాప్ తీసుకుంటే ఇది మహిళల రుతుచక్రాన్ని అందం విడుదలయ్యే సమయాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వద్దనుకునేవారికి అనుకూల సమయం ఎదో, వద్దనుకునేవారు లైంగిక చర్యలు దూరంగా వుండాలో కూడా తెలియజేస్తుంది. రాత్రివేళ ఈ అవా బ్రాస్లెట్ పెట్టుకుంటే చాలు. ఈ అవా ట్రాకర్ గడియారంలాగా ఉంటుంది. ఈ ట్రాకర్ మొబైల్ యాప్ తో అనుసంధానం చేసుకుంటే ఆ వివరాలు పుజోన్లో చూడచ్చు. కొన్నిసార్లు అండం ఎప్పుడు విడుదల అవుతుందో విడుదల సమయం తెలియకపోవటమే గర్భాన్ని దాలుస్తుంటారు మహిళలు . అండం విడుదల సమయం తెలియకపోవటమే ఇందుకు కారణం అవా ట్రాకర్ ఈ సమయాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు హృదయ స్పందనలు శరీర ఉషోగ్రత హార్మోన్ల అసమతుల్యత . సైకలాజికల్ స్ట్రెస్ లెవెల్స్ మొదలైన ఎన్నో విషయాలు రికార్డు చేసి మరీ చెపుతుందీ అవా ట్రాకర్.
Categories
WhatsApp

అండం విడుదల చెప్పే బ్రాస్ లెట్

February 3, 2017
0 mins read
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అది జీవితాల్లోకి ఎలా వచ్చేసి కూర్చుందో చదువుతుంటే…
Read more
చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి ఎంతో కష్టం అనిపిస్తోంది. ఇంట్లో ఎవరికైనా అంటే డెమెన్షియా అంటే మతిమరుపు రావటం వంటి లేదా దీర్ఘ కాలం మంచంలో ఉండే జబ్బులొస్తే వాళ్ళ బాధ్యత సాధారణంగా ఇంట్లో భార్య పైనే పడుతుంది. భర్తకు డెమెన్షియా వస్తే ఐంన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత భార్యదే నని బంధువులు మిత్రులు భావిస్తారు. భర్త పైన ఎంతో జాలి చూపెడతారు. అసలు రోగికన్నా రోగికి సహాయంగా ఉండేవాళ్ళకే ఎక్కువ బాధ్యత అప్పగిస్తారు వైద్యులు. వాళ్ళతో ప్రేమగా ఉండాలని మందులు జాగ్రత్తగా ఇవ్వాలని వాళ్ళతో వారించవద్దనీ ఓర్పు సహనంతో ఉండమనీ భార్యకు చెపుతారు . ఇది వారికీ మానసికంగా తీవ్ర వత్తిడికి గురిచేసి అనారోగ్యంకు బారిన ఖచ్చితంగా పడతారని రిపోర్ట్. ఒకవేళ అది డెమెన్షియా నే అయితే ఆ జబ్బు అంటువ్యాధి కాకపోయినా భార్యకు వచ్చి తీరుతుందిట. జబ్బుతో వున్న వాళ్ళని భరించీ భరించీ వాళ్ళు ఆ వ్యాధిన పడతారట. పెద్ద సర్వే చేయక పోయినా ఇది కరక్టే ననిపిస్తోంది. ఈ సేవ చేయటం శ్రద్ధ తీసుకోవటం ఆడవాళ్ళ పాలిట జీవితకాల శిక్షలాగా ఉంటుందనటంలో ఆశ్చర్యం ఏదీ లేదు.
Categories
WhatsApp

నష్టపోయేది అన్నింటా ఆడవాళ్లే

February 3, 2017February 3, 2017
0 mins read
చాలా మంది జీవితాల్లో అనుభవించే విషయమే అయినా అదొక రిపోర్ట్ రూపంలో కనపడేసరికి…
Read more
మొదటి సారిగా గర్భం ధరిస్తే కొన్ని సురక్షిత సాధారణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడూ కూడా ఏ సమస్యకు సొంతంగా మందులు వాడక పోవటం తోలి సూచన. మందుల షాపులో అడిగి తీసుకోవటం సొంతంగా నిర్ణయించుకోవటం కఠిన సౌందర్య చికిత్సలు బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపెడతాయి. గర్భం దాల్చక యాంటాసిడ్స్ పారాసెటమాల్ మొదలైనవి కూడా వైద్యుల సలహా లేకుండా వాడద్దు.మొటిమలు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు క్రీమ్స్. అప్లయ్ చేయరాదు. విటమిన్లు ఐరన్ డోస్ లు వికారంగా ఉంటె డాక్టర్ ప్రత్యామ్నాయాల కోసం అడగాలి. ఒక వేళ వికారం ఉన్నపటికీ వైద్యురాలు ఇచ్చిన ప్రీనాటల్ విటమిన్లు ఐరన్ మందులు మిస్ చేయద్దు. ఎసిడిటీ లేదా తలనొప్పి ముఖం పైన బ్రేకవుట్స్ ఉంటె వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Categories
WhatsApp

ఈ సురక్షిత సాధారణ సూత్రాలు పాటించాలి

February 2, 2017
0 mins read
మొదటి సారిగా గర్భం ధరిస్తే కొన్ని సురక్షిత సాధారణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి.…
Read more
నడవకపోతే తప్పు వ్యాయామం చేయకపోతే నష్టం చివరకు కాస్సేపు కూర్చున్నా కష్టమే అంటే నిజంగా కష్టం. ముఖ్యంగా ఆడవాళ్ళూ పదిగంటల కంటే ఎక్కువగా కదలకుండా కూర్చుని పనిచేస్తే శరీర కణాలు జీవపరంగా ఎనిమిది సంవత్సరాల ముందుగా వృధాప్య లక్షణాలకు లోనవుతారని రిపోర్ట్. కదలకుండా ఎక్కువసేపు కూర్చున్నా స్త్రీల డి .ఎన్ .ఏ పోచలా చివర వుండే టెలోమెర్స్. పొడవు తగ్గిపోతుందని గుర్తించారు. వీటి పొడవు తగ్గటం అంటే వృధాప్యం రావటం అని అర్ధంట. ఊబకాయం , మధుమేహం వల్ల ఈ టెలో మేర్స్ పొడవు తగ్గిపోతుందిట. తర్వాత రోజుకు 40 నిమిషాల వాకింగ్ చేసినా ప్రయోజనం ఉంటుందంటున్నారు. అందుకే ఆడవాళ్లు ఎక్కువసేపు ఒక్కచోటే కూర్చోకుండా మధ్య మధ్యలో అటూ ఇటూ నడవటం రోజుకి ఒక గంట పాటు వ్యాయామం చేస్తే టెలోమెర్స్ పొడవు తగ్గే ప్రమాదం నుంచి బయటపడచ్చంటున్నారు. సో హాయిగా రెస్ట్ గా కూర్చోటానికి కూడా వీల్లేదన్నమాట.
Categories
WhatsApp

ఎక్కువ సేపు కూర్చుంటే వృధాప్యం

February 2, 2017
0 mins read
నడవకపోతే తప్పు వ్యాయామం చేయకపోతే నష్టం చివరకు  కాస్సేపు కూర్చున్నా కష్టమే అంటే…
Read more
Categories
WhatsApp

ఆ సమయంలో నొప్పిగా ఉంటే

February 2, 2017February 2, 2017
0 mins read
నెలసరి చాలా మంది ఆడపిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటూ ఉంటుంది. ప్రతిసారి…
Read more
ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో వాళ్ళు ఏమేం మోస్తూ వుంటారో అని. కొన్ని సార్లు అధ్యయనాలు కూడా జరిగాయి. తీరా సరదా కోసం ల;లేదా అంతంత బరువున్న బ్యాగ్ లు మోస్తే ప్రాబ్లమ్ ఉంటుందీ అని సర్వే చేస్తే బరువైన హ్యాండ్ బ్యాగ్ లో తలనొప్పి వస్తుందని తేలింది. హ్యాండ్ బ్యాగ్ బరువుకీ తలనొప్పికీ సంబంధం ఏమిటంటే ముందుగా భుజం మెడనొప్పిగా ఉండటం దీర్ఘకాలం ఆ నెప్పి ఆ కండరాలు బలహీనమైన మెడ పక్కకి అది దీర్ఘకాలం తలనొప్పికి దారి తీస్తుందిట. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ లో బరువైన పుస్తకాలు ఇతర వస్తువులు మోయవలిసిన ఉద్యోగం కనుక చేస్తుంటే చేతులు మార్చమంటున్నారు. అటు ఇటు మారుస్తూ వుండే ఈ నొప్పుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. తర్వాత వీలైనంత వరకు బ్యాగ్ లో బరువు తగ్గించమని హితవు చెపుతున్నారు.
Categories
WhatsApp

తల నొప్పికి హ్యాండ్ బ్యాగ్ కారణం కావచ్చు

February 2, 2017
0 mins read
ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్స్ పైన ఎప్పుడు చాలా కామెంట్లు వస్తుంటాయి. అంతలేసి బ్యాగుల్లో…
Read more
మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గం న్యూరోసైన్స్ బట్టి చెప్పాలంటే పుస్తకాలు చదవటమే నంటున్నారు. ఎక్స్పెర్ట్స్ ఖచ్చితంగా పుస్తకాలు చదివే అలవాటు జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. కండరాలకు ఏ విధంగా వర్కవుట్స్ అవసరమో మెదడుకు అలాగే మంచి వర్కవుట్ కావాలి. ఒక పుస్తకం చదివిన ప్రతిసారి మెదడు ఉద్దీపన పై సరికొత్త మెమొరీ అందుతుంది. అలాగే పుస్తక పఠనం ఒత్తిడి ని తగ్గిస్తుంది. మంచి నవల లేదా చక్కని వ్యాసం చదివితే దైనందిన టెన్షన్లు ఇట్టే డ్రయిన్ అప్పటి అయిపోయి రిలాక్సవుతారు. ఏదైనా చదివే వ్యాపకం కొత్త ఊహలతో మనసుని నింపేస్తుంది. కొత్త ఆలోచనతో మనస్సు చైతన్యం అవుతుంది. ఏకాగ్రత పెరుగుతోంది. ఎటెన్షన్ ఫోకస్ అవుతోంది. అనేక సమయాల్లో పుస్తకాలే మంచి నేస్తాలు. సాధారణమంగా గృహిణులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిపని అయ్యాక పిల్లలు భర్త వచ్చే వరకు ఎదో ఒక కాలక్షేపం సృష్టించుకుంటారు. అదే పుస్తకాలు చదివే హ్యాబిట్ అలవర్చుకొంటే పిల్లలు పెద్దయి ఎవరి దారిన వాళ్ళు జీవితాలు నిర్మించుకున్న ఈ పుస్తకాలు జీవితాంతం తోడుగా ఉంటాయి . మంచి పుస్తకాలూ చదవండి.
Categories
WhatsApp

ప్రశాంతత కు మార్గం బుక్ రీడింగ్

February 2, 2017
0 mins read
మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గం న్యూరోసైన్స్  బట్టి చెప్పాలంటే పుస్తకాలు చదవటమే నంటున్నారు.…
Read more

Posts navigation

Previous 1 … 1,015 1,016 1,017 … 1,046 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.