Categories
చాలామంది పిల్లులు ,కుక్కలు పెంచుతుంటారు . కానీ పిల్లులు పెంచేవాళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెపుతున్నారు . పిల్లులు ద్వారా మనుషులకు క్షయవ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్నారు . ఎలుకలు,పశువుల నుంచి మైకో బాక్టీరియం అనే బాక్టీరియాపిల్లులను చేరుతోంది అంటున్నారు . ఈ బాక్టీరియా సోకినా పాలు తాగటం వల్ల పిల్లుల్లో క్షయవ్యాధి లక్షణాలు వస్తాయి . వీటి నుంచి యజమానులకు ఆ అనారోగ్యం అంటుతోందంటున్నారు . కనుక పిల్లులను పెంచే విషయంలో కాస్త జాగ్రత్త గా ఉండండి అంటున్నారు .