కాఫీలో మాయ ఏమిటో గానీ సమస్త మానవాళి అతి ప్రియమైన పానీయం అయింది. సాధారణంగా అద్యాయినాలు మాత్రం కాఫీలో వుండే కెఫిన్ కు మానసికంగా ఉత్సాహం ఇచ్చే శక్తి వుందంటారు. మెదడుకు సందేశాలు అందించే జీవ రాసాయినం ఎదినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తే కెఫిన్ దాన్ని హుషారు చేస్తుంది. చాలా మంది రాత్రి భోజనం కాఫీ తో ముగిస్తారు. కా కెఫిన్ ఉదర రసాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కాఫీ ఎడ్రినల్ గ్రంది పైన ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల కనుగుడ్లు విచ్చుకుని దృష్టిలో స్పష్టత వస్తుంది. కేఫెన్ ప్రభావం తో రక్త నాళాలు వికసిస్తాయి గుండె వేగం పెరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కెఫిన్ వల్ల వున్నాయి కనుకే శరీరంలోని ప్రతి అంగం కాఫీని కోరుకుంటుంది. కాఫీలో ఏముందనుకోన్నాం కదా, కెఫెన్ వుంది. ఇదే మనుషుల పైన తీవ్ర ప్రభావం చుపించేది.

Leave a comment