బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత బిల్డప్ వుంటుందా అనుకుంటే ఉంటుంది.  అదూన్ సెలబ్రెటీల పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. అమీర్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ ,అక్షయ్ ఖన్నా వంటి హేమ హేమీలకు పర్సనల్ గా సినిమాల్లో కూడా హెయిర్ స్టైలిస్ట్ ఈవిడే. ముఖం అందంగా కనపడాలనుకుంటే హెయిర్ కట్ స్టైల్ గా  ఉంటేనే అని అదూన్ అభిప్రాయం. జుట్టుతో గమ్మత్తులు చేసే ఈ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ ఇంగ్లాండ్ లో శిక్షణ పొందింది. ఆమె చేతిలో పడితే హీరో హీరోయిన్ల లుక్ మారిపోవాల్సిందే. ఇదివరకు ఏ మేడిసనో ఇంజినీరింగో ఉద్యోగాలంటే. ఇప్పుడు హెయిర్ కటింగ్ కూడా కనకవర్షం కురిపించే జాబ్ నని  అదూన్  ని చుస్తే తెలుస్తుంది.

Leave a comment