జీడి పప్పులో కన్నా అధిక ప్రోటీన్ లు ,ఆపిల్ లో కన్నా ఎక్కువ పీచు ఉన్న సిలోన్ బచ్చలి ని ఇళ్లల్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇందులో నీటి శాతం తో పాటు ఎ బి సి విటమిన్లు ఐరన్,కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దాన్ని నేల బచ్చలి,దుంప బచ్చలి అని కూడా అంటారు ఇందులో పుష్కలంగా ఉండే రెటినాల్ కంటి కండరాలు బలహీనతను తగ్గిస్తుంది. పొడి బారిన చర్మం పిగ్మెంటేషన్ తో బాధపడేవాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్ శాతం ఎక్కువ కావటం తో ఇది మెదడు కండరాలు పని తీరును మెరుగు పరుస్తుంది. వారానికి ఒక సారి ఈ ఆకును ఉడికించి జ్యూస్ లా చేసి తాగితే చర్మం మెరుస్తుంది.

Leave a comment