Categories
ఈ తరం పిల్లలకు చదివే అలవాటు దాదాపు లేనట్లే. క్లాస్ బుక్స్ తప్ప వేరేవి ఎప్పుడు చదవరు కానీ పిల్లల్లో చదివే అలవాటు ను తల్లితండ్రులే పెంచాలి. వాళ్ళంతట వాళ్ళు చదవరు. కానీ పెద్దవాళ్ళు కొన్ని బుక్స్ పరిచయం చేస్తూ వాళ్ళలో ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. పిల్లల పుస్తకాలు,జానపద గాధలు కథలు సాహసానికి సంబందించినవి,యాత్ర సాహిత్యం అన్నింటిని పిల్లలకు పరిచేయం చేయవలసింది పెద్దవాళ్ళే. వాళ్ళకు చదవటం కాకపోతే అలవాటు అయ్యేవరకు చదవి వినిపించాలి. పుస్తకాలు చదివితే మెదడు పనితీరు మెరుగవుతోంది అనేక అధ్యయనాలు చెపుతున్నాయి కొత్త పదాలు తెలుస్తాయి. పిల్లల వయసుకు తగ్గట్లు పుస్తకాలు ఎంచి ఇస్తూ వాళ్ళలో చదివే అలవాటు ప్రోత్సహించాలి.