Categories
Gagana

చదువుకోసం సినిమాలోదిలేసి……………..

గ్లామర్ పరిశ్రమలో అడుగు పెట్టాక ఇందులో నిలదొక్కుకోనెందుకు ఎంతో కష్ట పడతారు. రూపం, స్టయిల్, ఎన్నో విషయాల్లో మార్పులు తీసుకుంటున్నారు. ఎన్నేళ్ళయినా హీరోయిన్ స్ధానాన్ని పదిల పరుచుకునేందుకు చూస్తారు. కానీ లీడర్, మిర్చి వంటి సినిమాల్లో సక్సెస్ ని రుచి చుసిన రిచా గంగోపాధ్యాయా మాత్రం స్టార్ హీరోల సరసన అవకాసం వచ్చినా వద్దనేసింది. ఆమెకు చదువంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఎం.బి.ఎ చదవాలని కోరిక. అది కూడా అమెరికా లోనే అనుకుందిట రీచా. అందుకోసం వచ్చిన అవకాశాలు వదులుకుని వాషింగ్టన్ లో ఎం.బి.ఎ చదువుకుంది. ఇటీవల పట్టా పుచ్చుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు రిచా వయస్సు 31 సంవత్సరాలు. ఇలాంటి వయస్సులో సినిమాలు వదిలేసి చాడువేమిటి అని అందరు వెనక్కి లాగినా చదువు మానను అని కెరీర్ వదిలేసింది రీచా, అరుదైన అమ్మాయి.

Leave a comment