మేవాట్ సర్పంచి షహనాజ్ ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన సర్పంచిగా రికార్డు సృష్టించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి సర్పంచిగానే కాదు, డాక్టరమ్మగా సేవలు అందిచనున్నది. రాజస్థాన్, హర్యానా కలిసి పంచుకుకొంటున్నా ప్రాంతం మేవాట్. ఇక్కడ ఆడపిల్లల్నీ స్కూల్ కు పంపరు. తలపైన ముసుగు ఉండాల్సిందే  ఆఊల్లో పుట్టిపెరిగిన షహనాజ్, డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. మేవాట్ సమీపంలోని గడ్డన్ గ్రామంలో ఆమె తాత సర్పంచిగా పని చేశాడు.  తాత తర్వాత మనువరాలు ఆ ఊరి సర్పంచి అయ్యింది.  తీర్ధంకర మహాజన్ మెడికల్ కాలేజీ రిసెర్చు సెంటర్ లో చుదువు కొన్న షహనాజ్ గురుగ్రామ్ లోని సివిల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకొంటోంది.  తాను నేర్చుకొన్న విద్యతో గ్రామాన్నీ బాగు చేసేస్తానంటోంది షహనాజ్.

Leave a comment