కెరీర్ కాస్త ముందుగా మొదలు పెట్టేశానని ఇప్పుడు కాస్త దిగులుగా ఉంది. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. వేగంగా నిర్ణయం తీసుకొని 17 సంవత్సరాలకే సినిమాల్లోకి వచ్చాను. మాది సినిమా కుటుంబం కావటంతో చదువు గురించి ఆలోచించ లేదు. కానీ నా కోడుకు తైమూర్ విషయంలో అలా జగరకుండా జాగ్రత్తాపడతాను .వాడిని చదవు ,ప్రపంచజ్ఞానం వచ్చేలా తీర్చీ దిద్దుతాను అంటోంది కరీనా కపూర్. సైఫ్ తరపు వాళ్ళు గొప్ప చదువులు చదివారు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి వంటి ప్రముఖ విద్యాయాల్లో చదువుకొన్నారు. తన పిల్లలు సాధా ,అబ్రహాం కూడా బాగా చదువు కొన్నారు. నేను ప్రపంచం మొత్తం తిరుగుతూ గొప్ప వ్యక్తులను కలుస్తూ కొత్త విషయాలు తెలుసుకొగలిగాను.కానీ చదువు కొరత నాకు తీరనిదే అంటోంది కరీనా. ఇది ఎవ్వరికైనా వర్తిస్తుంది. చదువుకోవటం ఎంతో ముఖ్యం కదా.

Leave a comment