నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా ఏ ఆర్ రెహమాన్ అయినా వాళ్లకిష్టమైన రంగం లోనే ముందుకు వెళ్లి టార్గెట్ రీచ్ అయ్యారు. చాలా మందికి వాళ్ళ ఆసక్తి గురించి వాళ్ళకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అసలు మన దేశంలో నిరుద్యోగానికి ఇది ప్రధాన కారణం తెలుసా.. చదువుకీ ఆసక్తికీ వృత్తికీ బలమైన సంభంధం ఉంది. ఈ మూడు ఒక్కటే కావాలి. నీలాంటి టీనేజర్ ఈ నిముషంలో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు నిన్ను శోధించుకుంటూ అసలు నీ ఇష్టం ఎటువైపుని వుందో తేల్చుకో. ఆ చదువు ద్వారా వచ్చే ఉద్యోగం నీ అభిరుచికి సరిపోతుందా ఆ కెహెచ్డీవువులో ఆ ఉద్యోగం తో చేసే పని నీకు సంతృప్తి ఇస్తుందా లేదా తేల్చుకుంటే ముందుగా నువ్వేం చదువుకోవాలో తెలుస్తుంది. ఇలాగే జీవితం కూడా. ఏమంటావు. ఇలా తేల్చుకోలేనని తేల్చేసుకుంటే అప్పుడిక సైకోమెట్రిక్ పరీక్షకు పోదాం !!
Categories
Nemalika

చదువుకీ ఆసక్తికీ వృత్తికీ లింకుంది

నిహారికా ,

భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం  విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న  రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా ఏ ఆర్ రెహమాన్ అయినా వాళ్లకిష్టమైన రంగం లోనే ముందుకు వెళ్లి టార్గెట్ రీచ్ అయ్యారు. చాలా మందికి వాళ్ళ ఆసక్తి గురించి వాళ్ళకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అసలు మన దేశంలో నిరుద్యోగానికి ఇది ప్రధాన కారణం తెలుసా.. చదువుకీ ఆసక్తికీ వృత్తికీ బలమైన సంభంధం ఉంది. ఈ మూడు  ఒక్కటే కావాలి. నీలాంటి టీనేజర్ ఈ నిముషంలో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు నిన్ను శోధించుకుంటూ అసలు నీ ఇష్టం ఎటువైపుని వుందో తేల్చుకో. ఆ చదువు ద్వారా వచ్చే ఉద్యోగం నీ అభిరుచికి సరిపోతుందా ఆ కెహెచ్డీవువులో ఆ ఉద్యోగం తో చేసే పని నీకు సంతృప్తి ఇస్తుందా లేదా తేల్చుకుంటే ముందుగా నువ్వేం చదువుకోవాలో తెలుస్తుంది. ఇలాగే జీవితం కూడా. ఏమంటావు. ఇలా తేల్చుకోలేనని  తేల్చేసుకుంటే అప్పుడిక సైకోమెట్రిక్ పరీక్షకు పోదాం !!

 

Leave a comment