పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తున్న వనజా ఉదయ్ ఎం.ఎ సోషియాలజీ పబ్లిక్ రిలేషన్స్ లో పి.జి డిప్లమా భారత నాట్యంలో డిప్లమా, స్పానిష్ లో డిప్లమా, టూరిజంలో డిప్లమా, కూచిపూడి నృత్యం టూరిజంలో డిప్లమా చేసారు. సుమారు 4300 పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో ఆమె ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నో గౌరవాలు, సత్కారాలు, పురస్కారాలు పొందారు. ఆమె చేసిన డాన్స్ బాలేల్లో ముఖ్యమైనవి అలివేలు మంగ విలాసం, మోహినీ భస్కాసుర. తెలుగు విజయం, శ్రీ కృష్ణ దేవరాయ ఎంతో పేరు తెచ్చాయి. సంప్రదాయ నృత్యాలకు జీవం పోసిన వనజా ఉదయ్ జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలతో కూచిపూడికి కీర్తి తెచ్చారు.

Leave a comment