ప్రాచీన ,ఆధునిక సమాజంలో సామజిక వివక్ష కు ఎదురొడ్డి సమాజాన్ని చైతన్యవంతం చేసిన పదిమంది మహిళల గుర్తుగా యూనివర్సిటీల లో పది పీఠాలు (అకడమిక్ ఛెయిర్ ) ఏర్పాటు చేయమన్నారు . ఆ పీఠాలను అలంకరించమన్న ప్రతిభా మూర్తులలో లల్లేశ్వరి ,లీలావతి,ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ,అహల్య బాయ్ హల్కర్ ,కమలా సహానీ,ఆనందీ బాయ్ జోషి ,అమృతా దేవి బెనివాల్ ,హన్షామెహతా  మహాదేవి వర్మ ,రాణి గైదిన్ లియు ఉన్నారు. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళా పాత్రను గుర్తించి ,మహిళా మేధస్సును ,విశిష్టతను,నైపుణ్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయటం కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ఇటీవల నిర్ణయం తీసుకుంది . ఈ ఆలోచన ఈ దిశగానే ఈ పది విశ్వ పీఠాలు ఏర్పాటు చేస్తున్నారు .

Leave a comment