అందాన్ని కాపాడుకునేందుకు మూడు బేసిక్ సూత్రాలు ఉంటాయి. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ .ఇవి మూడు రాత్రివేళ ముఖ్యంగా చేయాలి. పగలంతా చర్మం పైన పడిన మురికి తొలగించుకునేందుకు దారి ఇదే. పొడి చర్మం అయితే క్రీమ్ క్లెన్సర్, జిడ్డుచర్మం అయితే సాలిసిలిక్ యాసిడ్ గల మెడికేటెడ్ రకం ఎంచుకోవాలి. ముఖం చల్లని నీళ్ళతో కడుక్కొవాలి. క్లెన్సర్ ను తొలగించుకొనేందుకు టోనర్ వాడాలి. మరీ ఎక్కువ ఆయిల్ స్కిన్ అయితే జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ అఫ్లైయ్ చేస్తే చర్మం చక్కగా ఉంటుంది. ఒకటి రెండు సార్లు బ్యూటీ క్లినిక్ లో ఇవి అప్లైయ్ చేయటం చూస్తే ఇంట్లో కూడా వాడుకోవచ్చు.

Leave a comment