22 సంవత్సరాల మీరా శర్మ తాను స్ధాపించిన టాంగిల్డ్ సంస్దని విజయవంతంగా నడిపిస్తుంటుంది. కాన్సర్ తో పోరాడే చిన్న పిల్లలు మహిళలకు సహజమైన జుట్టు సేకరించి విగ్గులు ఇస్తుందీ సంస్ధ. సింధటిక్ విగ్గులతో దురదలోస్తాయి. ఈ సమస్యను అర్ధం చేసుకుని కాన్సర్ బాధితురాలైన పిల్లల కష్టాన్ని చూసి చలించి పోయి విగ్గులు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీ తో కలిసి ఈ పని చేస్తుంది. ఇజ్జ విగ్గుకు 4500 రూపాయిలు ఖర్చవవుతుంది. చెన్నాయ్ రోటరాక్ట్  క్లబ్ ఆఫ్ విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ కృషిగానూ మీరా శర్మకు ఎన్నో ఆవార్డులు వచ్చాయి. చెన్నాయ్ లో పుట్టిన మీరా శర్మ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ లో BBA  పూర్తి చేసింది.

Leave a comment