Categories
WhatsApp

చక్కర కొంచం తక్కువ తిన్నా పర్లేదు.

తియ్యగా వుండే పదార్ధాలు చాలా మందికి ఇష్టమే. సాధారణంగా టీనేజర్లు ఇవి తినాలనుకుంటారు. అసలు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో టీనేజర్లకు ఏమిస్తే బాగా పెరుగుతారు అన్న విషయంలో తల్లులకు చాలా కన్ఫూజన్ వుంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఎప్పుడో ఏ చాక్లెట్ ట్టొ ఇమ్మని ఏడ్చే పిల్లలు వయస్సు పెరుగుతన్న కొద్దీ శరీరం పైన శ్రద్ధ ఎక్కువై అస్సలు తీపే వద్దంటారు. ఇష్టాన్ని కూడా చంపుకుంటారు. ఇచ్చిన బాక్స్ తిరిగి తెచ్చేస్తుంటారు. డాక్టర్లు మాత్రం టీనేజర్ల పై చదువు భారం హార్మోన్ల ప్రభావం వుంటుంది కనుక రోజుకు ర్రెండు సార్లు అయినా పాలు ఇవ్వాలని బలమైన ఆహారం తినిపించాలని చెపుతారు. అయితే పాలల్లో కలిపె చక్కర, పండ్ల రసాలకు జత చేసే చక్కర, అప్పటి వరకు అలవాటైన తియ్యని పదార్ధాల్లో తీపి వాడకం ఎక్కువైపోతుందని భయపడుతూ వుంటారు. నిపుణులు ఏం చెపుతున్నారంటే టీనేజర్లు నిరభ్యంతరంగా రోజుకు 18 టీస్పూన్ల చక్కర ఇవ్వచ్చంటున్నారు. అంటే రోజుకు 60-70 గ్రాములు ఓకే అన్నమాటేగా.

Leave a comment