టీలో, కాఫీలో వేసుకునే చక్కర మానేస్తే చాలు పెద్ద ప్రాబ్లం వుండదు. అనుకుంటారు చాలా మంది. కానీ మనకు తెలియకుండానే ఎంతో చక్కర మన ఆహారంలో భాగం అయిపోతూ వుంటుంది. ఇది ఎలాంటి పోషకాలను అందించదు సరికదా శరీరంలో అదనపు కొవ్వుగా మారుతుంది. దీన్ని తప్పనిసరిగా తగ్గించాలి. అలాగే సాస్ ల కొంటే తాజాగా పచ్చళ్ళు చేసి తినడం మేలు రకరకాల రుచులలో దొరికే పెరుగు, పాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి రుచికి బాగున్న వాటిలోని చక్కరలో ప్రమాద స్ధాయిలో ఉంటాయి. అవీ వద్దనుకోవడమే ఇక చాక్లెట్స్ విషయానికి వస్తే డార్క్ చాకొలెట్ ఎంచుకోవాలి. మిగతా కేక్స్ జోలికి పోనేవద్దు.

Leave a comment