ప్రపంచ ఆరోగ్య సంస్ధ గణాంకాల ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తి చక్కర వినియోగం 58 గ్రాములుగా వుంది. అదే చైనా లో అయితే 33 గ్రాములు, పాకిస్తాన్, అమెరికా, ఇండోనేషియాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింన 25 గ్రాముల పరిమితి కంటే ఎక్కువే. చక్కెరా ఒక కార్బోహైడ్రేడ్. శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. ఇది చాలా మొక్కల్లో సహజ సిద్దంగా వుంటుంది.మొక్కలు సూర్య రశ్మిని ఆహారంగా మార్చుకునే పోటో సింతసిస్ ప్రక్రియకు తోడ్పడేదే సుక్రోజ్. చెరుకులో ఈ సుక్రోజ్ భారీ పరిమాణంలో వుంటుంది. సుక్రోజ్ను టేబుల్ షుగర్ అంటారు. పండ్లు, కూరగాయలు, తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. లాక్టోజ్ పాలు, పాల ఉత్పత్తులలో వుంటుంది. ఇవన్నీ సరిచూసుకుని మన శరీరంలో ఎంత చక్కర చేరుకుందో లెక్కేసుకోవచ్చు.

Leave a comment