ఇప్పటివరకు 59 దేశాలు చక్రాల కుర్చీలో తిరిగి వచ్చాను ఈత, కయాకింగ్, పారా సైక్లింగ్ పారా గైడింగ్ వంటివి ఎన్నో చేశాను.  ఎన్నో ఏళ్ల పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో మంచం లోనే ఉన్నాను. 38 ఏళ్ళు వచ్చాక ఎన్నో చికిత్సల తర్వాత కాస్తా నడవగలను నటి భూమిక నాకు బంధువు ఆమె బహుమతిగా ఇచ్చిన ఆటోమేటిక్ వీల్ చైర్ నా జీవితాన్ని మార్చింది అంటుంది పర్వీందర్ చావ్లా. చక్రాల కుర్చీలో వెళ్ళ గలిగిన అన్ని ప్రాంతాలు వెళ్ళగలిగాను. దుబాయ్ వంటి నగరాల్లో చక్రాల కుర్చీ వాళ్లకు అన్ని సదుపాయాలు ఉంటాయి. అలాంటి దేశాలు ఎంచుకుని ఒక్కదాన్నే అన్ని తిరగేశాను. మనల్ని మనం నమ్ముకుంటే చాలు ఏది మనల్ని ఆపలేదు అంటుంది పర్వీందర్.

Leave a comment