Categories
టీ పొడితో అద్భుతమైన టీ తాగడం మాత్రమే కాదు. ఆ మిగిలిపోయిన టీ పొడిని క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. అద్దాలు , కిటికీలు , టైల్స్ పైన మరకలు పడుతుంటే టీ పొడిని మరిగించిన నీళ్ళ తో తుడిచేయొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో కూరల వాసన వదలకపోతే మిగిలిన టీ పొడిని ఎండనిచ్చి కప్పులో పోసి పెట్టచ్చు. కారు ఫ్రెషనర్లు గా కూడా టీ బాగ్స్ బాగా ఉపయోగ పడతాయి. ఎండలో తిరిగి మొహం కమిలిపోతే ఫ్రిడ్జ్ లో ఉంచిన , వాడేసిన ఆ కమిలిన చోట పెట్టి కాసేపు పడుకుంటే చాలు. మొహం తేటగా ఉంటుంది. కార్పెట్ పైన ఏదైనా పడి వాసన వస్తుంటే టీ పొడి చల్లి కాసేపు ఆగి దాన్ని బయట దులిపేస్తే వాసన మాయమౌతుంది.