ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది. తిప్ప తీగ తాజా ఆకు సంపాదించ గలిగితే జలుబు, దగ్గు, దగ్గరకు రావు. కరక్కాయలు, సొంటి, మిరియాలు సమభాగాలుగా తీసుకుని పొడి చేసి ఆ పొడిలో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బుగ్గన పెట్టుకొంటే దగ్గు రాదు. ఏదైనా తినాలనిపిస్తే చిలకడ దుంపలు వుదికిన్చుకుని లేదా కాల్చి ముక్కలు చేసి ఉప్పు మిరియాల పొడి జల్లి తిని చూడండి. ఉపసమనం వస్తుంది. దగ్గడం తో గొంతు మంటా, బొంగర పోవడం జరిగితే దాల్చిన చెక్క, మిరియాలు పొడి చేసి టీ పెట్టుకుని తాగితే ఉపసమనం లభిస్తుంది. తేనె, అల్లంరసంలో ఇంగువ కలిపి ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే గొంతు బాధలు వుండవు. వాము, పుదినా చాయ్ లు శరీరం లోని హానికారక వ్యర్ధాలను బయటకి పంపడంలో తొడ్పడతాయి.

Leave a comment