మసాలా వేసిన ఏ పదార్ధం కాస్త రుచిగా వుందని తినేసినా గొంతులో మంటగా అనిపిస్తుంది. ఉదరంలో ఏర్పడిన గ్యాస్ గొంతు నుంచి బయటికి పోతూ ఇలాంటి అసౌకర్యం వస్తుంది. సాధారణంగా గ్యాస్ నివారణ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అదే పనిగా ఈ టాబ్లేట్స్ వాడటం కూడా సరైన పద్దతి కానేకాదు. సహజ పద్దతుల్లోనే ఈ గొంతుమంట పోగొట్టుకోవాలి. ఒక టీ స్పూన్ నేతిని చల్లని పాలలో కలిపి తీసుకుంటే యాసిడిటి తగ్గిపోతుంది. నాలుగైదు తులసి ఆకుల్ని ఉదయం పూట నములుతున్న యాసిడిటీ పోతుంది. నీళ్ళలో కొద్దిగా వాము వుడకపెట్టి ఆ నీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటు ఉంటే కూడా మంచిదే సొంపు గింజల్లోని యాంటి అల్సర్ గుణాలు కూడా యాసిడిటీని తగ్గించుకోవడంలో సహకరిస్తాయి. సొంపు గింజలు నానబెట్టిన నీటిని తాగినా ఇదే ఫలితం ఇస్తుంది.

Leave a comment