నాకెప్పుడూ సవాళ్ళు నచ్చుతాయి సాదాసీదా జీవితం నడపడం నాకెప్పుడూ నచ్చదు . ఎప్పటికప్పుడు జీవితంలో నేను జయించవలసింది ఏదో ఉంటేనే బావుంటుంది అంటోంది జాన్వీ కపూర్ . మా అమ్మ మమ్మల్ని బాగా చదివించి ప్రయోజకులను చేసి మంచి వ్యక్తితో పెళ్ళి చేయాలనుకునేది . నేను సినిమాల్లోకి రావాలని ముందు అనుకోలేదు . నటించేందుకు నెమ్మదిగా ఇష్టం పెరిగింది . బహుశా ఆ సవాళ్ళను నేను ఇష్టపడ్డాను . సినిమా చేస్తాను అన్నప్పుడు భయపెట్టారు . రెండో సినిమా కి ఇటువంటిది చేయటం సాహసమే అన్నారు . కానీ నేను నా మనసుని నమ్మను . నా ఇష్టాన్ని నేనే గౌరవించుకొన్నాను . సినిమా నా జీవితం అయిపోయింది . ఒకవేళ నేను నటిని కాకపోతే సృజనాత్మక రచనలు చేసేదాన్ని . ప్రపంచాన్ని చుట్టేదాన్ని అంటోంది జాన్వీ కపూర్ .

Leave a comment