Categories
Soyagam

చర్మం ఇరిటేట్ అవ్వుతుంటే……

వాక్స్ చేసుకున్నాక ఒక్కో సారి చర్మం రఫ్ గా, బ్రౌన్ గా మారిపోతుంది. సున్నితమైన చర్మం గలవారికి హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వుంటుంది. అలాంటప్పుడే చర్మం ఇలా కందిపోతుంది. హెయిర్ ఫాలికల్ చుట్టూ వాపు లేదా ఎరుపు లేదా ఇతర సమస్యలు రావొచ్చు. కుదురు ఓపెనింగ్ దగ్గర పిగ్మేంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. వీటిని అరికట్టటానికి వాక్సింగ్ ముందు, తర్వాత ఐస్ ప్యాక్ అప్లయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువగా అయిపోతే పదే పదే చర్మం ఇరిటేషన్ కు గురవ్వుతుంటే అప్పడు డెర్మటాలజిస్ట్ ను సంప్రదించ వచ్చు. స్టెరాయిడ్ క్రీములతో ఆ సమస్య పోతుంది. ఇవన్నీ కాదనుకుంటే వాక్సింగ్ మానేసి షేవింగ్ లేదా లేజర్ హెయిర్ రిడక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్దతులను అనుసరించడం మేలు.

Leave a comment