Categories

బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి తమిళ సంతతి మహిళ గా చరిత్ర సృష్టించారు ఉమా కుమారన్. 36 సంవత్సరాల ఉమా పుట్టింది పెరిగింది లండన్ నగరంలో. శ్రీలంక లోని అంతర్యుద్ధం కారణంగా 42 ఏళ్ల క్రితం బ్రిటన్ కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. పబ్లిక్ పాలసీ లో మాస్టర్ చేసిన ఉమా నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొఫెషనల్ లో పనిచేశారు తర్వాత లేబర్ పార్టీలో చేరారు. పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్ గా పలు బాధ్యతలు నిర్వహించారు. 2010లో లండన్ లోని హారో లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తమిళ సంఖ్య ఎక్కువగా ఉన్న స్ట్రాట్ ఫోర్డ్ అండ్ బౌ నియోజకవర్గంలో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి 40 శాతం పైగా ఓట్లతో విజయం సాధించారు.