ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

Leave a comment