టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మొటిమలు పోతాయి. చర్మం నిగారింపు కోసం టొమాటో గుజ్జు తేనే కలిపి చర్మానికి రాసి పది నిముషాలు ఆరనిచ్చి కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment