ఏ ఉప్మాలోనో వస్తే కరివేపాకు ను జాగ్రత్తగా ఏరిపారేస్తాం. కానీ దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. చర్మ సౌందర్యం ఇనుమడింప చేయటంలో కరివేపాకు పాత్ర చాల ఉంది. ఇది జుట్టూ పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఇన్పెక్షన్స్ నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉటుంది. రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని   తగ్గిస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేసే శక్తి కరివేపాకులో పుష్కలంగా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. అన్ని కూరలలోనూ కరివేపాకుతోనే తాలింపు పెడతారు కనుకనే దక్షణాది ప్రాంతాల వారికి జీర్ణ సంబధమైన వ్యాదులు తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కడుపులో చిరాగ్గా ఉంటే ఉప్పు, మిరియాలు, కరివేపాకు కలిపి నూరి తింటే నిమిషాల్లో తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు.

Leave a comment