బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి లేదా కాఫీ పొడి తో చర్మం రుద్దితే పునరుత్తేజం వస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేసిన చర్మం బిగుతుగా వుంటుంది. కొబ్బరి నూనె కొంచం వెచ్చగా చేసి ఉపయోగించినా మేలే, బాదాం నూనె చర్మానికి మాయిశ్చురైజర్ లా ఉపయోగ పడుతుంది. నూనె వెచ్చ చేసి చర్మం పై నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఉపయోగం వుంటుంది.

Leave a comment