ఇంటి వైద్యం చాలా సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. ప్రతి చిన్ని అనారోగ్యానికి టాబ్లెట్స్ వాడే అలవాటు మానుకోవాలంటే ఇంటి చిట్కాలు ఎలుసుకోవాలి. ఒక గ్లాసు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఇన్ ఫ్లమెషన్ కు బాగా పనిచేస్తుంది. అల్లంరసం , పసుపు, తేనె, కలిపి తెసుకుంటే గొంతు నొప్పి పోతుంది. లవంగాలు యాలకులు, జీలకర్ర పొడి చేసి నీటిలో కలిపి మరిగించి తాగితే వికారం తగ్గిపోతుంది. నిమ్మరసం లో ఉప్పు కలిపి ఫ్రిజ్ లో పెడితే చాలా రోజులు తాజాగా వుంటుంది. వేరుసెనగ నూనె లో రోజ్ వాటర్ కలిపి చర్మానికి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరం పొడిబారడం తగ్గిపోతుంది.

Leave a comment