తెల్లగా కనిపించాలనే కోరికతో ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగించి ఇక రంగు తేలక కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే బావుంటుంది ఆకునేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అంటే కానీ చర్మం రంగు మెరుగుపరచడం కోసం మాత్రం కాదు. ముఖం పైన విభిన్న కలర్ ప్యాచ్ తో వున్న మోల్స్, తెల్ల మచ్చలు, కాలిన గాయాలువున్నా చేస్తారే తప్ప లైటనింగ్ క్రీములు సన్ స్క్రీన్ లు మాత్రమే ప్ర్రస్తుత ప్రత్యామ్నాయం. వీటితో అయినా 20 నుంచి ౩౦ శాతం మాత్రమే చర్మం నునుపుగా మెరుగ్గా వుంటుంది కానీ, ఎన్ని క్రీములు వాడినా చర్మం రంగు మాత్రం సమూలంగా మాసి పోదు. సహజ సిద్దంగా గలరూపానికి మెరుగులు దిద్దే మేకప్ చేసుకోవడం నేర్చుకోవాలి. చర్మానికి పోషకాలందించే ఆహారం వల్ల మెరుపు నిగారింపు ఉంటాయి.

Leave a comment