కాస్త పెద్దవిగా అనిపించే ఉంగరాలు ధరించటం ఫ్యాషన్. ఈ ఉంగరం ధరించే వెలికి ఉంగరం ఉన్న మేరా నల్లగా నో తెల్లగా నో రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. ఉంగరం ధరించి,స్నానం చేయటం ముఖం కడుక్కోవడం కోసం సబ్బు వాడటం తో దాని తాలూకా డిటర్జెంట్ లు ఉంగరం అడుగుభాగంలో పేరుకు పోతూ ఉంటాయి. ఆ డిటర్జెంట్ ప్రతిచర్య వల్ల చర్మం నల్ల బడటం లేదా అలెర్జీలు రావటం జరగవచ్చు. లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది తరచూ ఉంగరాన్ని లేదా ఆభరణాలను తీసి శుభ్రం చేసి ధరించాలి. చేతులు కడిగే సమయంలో ఉంగరం వెనక ఎలాటి సబ్బు మిగలకుండా శుభ్రంగా కడుక్కోవాలి. లేదా ఉంగరం తీసి చేతులు కడుక్కొని పొడిగా ఉన్నాక ధరించాలి మెడచుట్టు ధరించే ఇతర ఆభరణాల విషయంలో కూడా ఇలాంటి జాగ్రతే తీసుకోవాలి.

Leave a comment