విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు లేక, బయట ఎండ లోకి వెళ్లి వచ్చినప్పుడు ఈ నూనె లో దూది ముంచి ముఖం తుడుచుకోవాలి.మురికీ, ఇతర వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. ఇది మంచి లిప్ బామ్. సౌందర్య ఉత్పత్తులు వాడటం ఇష్టం లేకపోతె పగిలిన పెదవులకు ఈ నూనె పూత లా వేసుకుంటే పెదవులకు తేమ అందుతుంది సమస్య పోతుంది. ఎండ లోకి వెళితే చర్మం నల్లగా అయిపోతుంది. ఈ నూనె మొహానికి మర్దనా చేసుకుంటూ వుంటే, ఎండ వల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల దెబ్బ తిన్న చర్మం తేటగా అయిపోతుంది. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి చర్మానికి మేలు చేస్తుంది.
Categories
Soyagam

చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

Leave a comment