ఎన్ని మాయిశ్చురైజర్స్ రాసుకున్నా, ఎన్ని క్రీములు ఉపయోగించినా చలి పెరిగిన కొద్దీ చర్మం పోదిబారుతూనే వుంటుంది. నిర్జీవంగా కనిపించడం సాధారణంగా జరుగుతుంది. ఈ క్రీమ్స్ కంటే కొన్ని రకాల పండ్లతో చర్మం సహజమైన తేమతో మెరుపుతో వుంటుంది. యాపిల్ లో రోగనిరోధక శక్తి ఎక్కువే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఈ పండు రోజు తీసుకుంటే చర్మానికి హాని కలుగనివ్వడు. బొప్పాయిలో వుండే విటమిన్ఎ తో పాటు ఏ పెయిన్ అనే పోషకం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మజాతి పండ్ల లో పీచు, సి విటమిన్, కాల్షియం సమృద్దిగా ఉంటాయి. చర్మం మెరవాలంటే రోజుకొకటి తినాలి. ఇక దానిమ్మ చర్మ రంద్రాలని శుబ్ర పరచడం, ముడతలు నివారించడం చేస్తుంది. జామలో వుండే ఎ, సి విటమిన్లు లైకోపిన్, కెరోటిన్ ఉంటాయి. ఇందులో వుండే కె విటమిన్ కళ్ళ కింద వుండే నల్లని వలయాలను తగ్గిస్తుంది.

Leave a comment